SpaceX Inspiration4: అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్‌ ఎక్స్‌(SpaceX) చరిత్ర సృష్టించింది. నలుగురు సామాన్యులతో కూడిన వాహకనౌకను బుధవారం రాత్రి నింగిలోకి పంపి..అరుదైన ఘనత సాధించింది.  ఈ ప్రాజెక్టుకు ‘స్పేస్‌ఎక్స్‌ - ఇన్‌స్పిరేషన్‌ 4’(SpaceX Inspiration4) అనే పేరు పెట్టారు. ఈ న‌లుగురు అంత‌రిక్షంలో మూడు రోజుల గడపనున్నారు. ప్రొఫెషనల్‌ వ్యోమగాములు(Astronauts) కాకుండా.. సామాన్య పౌరులతో కూడిన ఓ ప్రైవేటు వాహకనౌక భూకక్ష్యలో ప్రయాణించడం ఇదే తొలిసారి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రయోగం జరిగిందిలా..
బుధవారం రాత్రి 8.02 గంటల ప్రాంతంలో ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌(Kennedy Space‌ Center‌) నుంచి స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు 12 నిమిషాల తర్వాత డ్రాగన్‌ కాప్సుల్‌ రాకెట్‌ నుంచి వేరవడంతో వాహకనౌక భూకక్ష్యలోకి చేరింది. ఈ ప్రాజెక్టు విజయవంతమైందని, నిర్దేశిత మార్గంలో వెళ్లిన రాకెట్‌.. ప్రయాణికులను భూకక్ష్య(Earth orbit)లోకి తీసుకెళ్లిందని స్పేస్‌ఎక్స్‌(SpaceX) ప్రకటించింది.  కానీ స్పేస్‌ఎక్స్‌ ప్రయోగించిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ(ఐఎస్‌ఎస్‌)ను దాటి భూకక్ష్య వరకు వెళ్లింది. 



Also Read: Zoom App: జూమ్‌లో అద్భుతమైన కొత్త ఫీచర్‌ ..12 భాషల్లో లైవ్ ట్రాన్స్‌లేషన్‌! ఎలాగో తెలుసా..?


అంతరిక్షంలోకి వెళ్లిన వారెవరంటే...
ఫాల్కన్‌ 9 రాకెట్‌(Falcon‌ 9 Rocket‌) లో మొత్తం నలుగురు వ్యక్తులు ప్రయాణించారు. వీరిలో ఒకరు ఈ ప్రాజెక్టుకు రిచ్‌ స్పాన్సరర్‌ అయిన బిలియనీర్‌ 38ఏళ్ల జారెద్‌ ఇజాక్‌మన్‌. ఈయన ఈ రాకెట్‌కు కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు 29ఏళ్ల హేలీ ఆర్సెనాక్స్‌, 42 ఏళ్ల క్రిస్‌ సెంబ్రోస్కీ, 51ఏళ్ల సియాన్ ప్రాక్టర్‌ ఉన్నారు. అమెరికాలోని లూసియానకు చెందిన హలీ.. చిన్న వయసులోనే ఎముక క్యాన్సర్‌ను జయించింది. తనలాంటివారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఫిజీషియన్‌ అసిస్టెంట్‌ కోర్సును పూర్తి చేసి.. ప్రస్తుతం క్యాన్సర్‌ బాధితులకు సేవలందిస్తోంది. ఇక క్రిస్‌.. వాషింగ్టన్‌లో డేటా ఇంజినీర్‌గా పనిచేస్తుండగా.. సియాన్ ప్రాక్టర్‌ అరిజోనాలో కమ్యూనిటీ కాలేజీ ఎడ్యుకేటర్‌గా వ్యవహరిస్తున్నారు. 


గతంలో..
స్పేస్‌ఎక్స్‌ కంటే ముందు వర్జిన్‌ గెలాక్టిక్‌, బ్లూ ఆర్జిన్‌ సంస్థలు కూడా అంతరిక్ష పర్యాటకాన్ని ప్రారంభించాయి. బ్లూ ఆర్జిన్‌లో ఆ సంస్థ అధినేత జెఫ్ బెజోస్‌(Jeff Bezos‌) కూడా ప్రయాణించారు. అంతకుముందు వర్జిన్‌ గెలాక్టిక్‌ ప్రయోగించిన వాహకనౌకలో ఆ సంస్థ అధినేత రిచర్డ్‌ బ్రాన్‌సన్‌తో పాటు కంపెనీకి చెందిన మరో ముగ్గురు అధికారులు అంతరిక్షంలోకి వెళ్లారు. అయితే వీరంతా అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ(ISS) వరకే వెళ్లారు.  కానీ స్పేస్‌ఎక్స్‌ ప్రయోగించిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ఈ ఐఎస్‌ఎస్‌ను దాటి భూకక్ష్య వరకు వెళ్లింది. స్పేస్‌ ఎక్స్‌ ఇలా భూకక్ష్యలోకి సామాన్య పౌరులను తీసుకెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆ స్పేస్ ఎక్స్ సంస్థ  అపరకుబేరుడు ఎలన్‌ మస్క్‌(Ellen Musk)కు చెందినది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook