Sputnik v vaccine effect: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో మరో గుడ్‌న్యూస్ అందుతోంది. అర్జెంటీనాలో జరిగిన పరిశోధనలో వెల్లడైన కీలక విషయాలు ఆశాజనకంగా ఉన్నాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌పై చేసిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి(Corona pandemic) నియంత్రణకై ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్. క్లినికల్ ట్రయల్స్‌(Clinical Trials)లో 91.6 శాతం సామర్ధ్యం ఉందని తేలిన వ్యాక్సిన్ ఇది. త్వరలో ఇండియాలో కమర్షియల్ లాంచ్ కానుంది. ఈ వ్యాక్సిన్‌పై అర్జెంటీనాలో జరిగిన పరిశోధనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. కోవిడ్ నుంచి కోలుకున్నవారికి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సింగిల్ డోసు ఇస్తే సరిపోతుందని తాజా పరిశోధనలో తేలింది. కరోనా సోకినవారు స్పుత్నిక్ వి(Sputnik v vaccine) రెండవ డోసు తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉన్నట్టు కన్పించడం లేదని పరిశోధకులు తెలిపారు. సైన్స్ డైరెక్ట్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ విషయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


కరోనా వైరస్ (Corona Virus)నుంచి కోలుకున్నవారు స్పుత్నిక్ వి రెండవ డోసు వేసుకుంటే యాంటీబాడీలు (Antibodies)పెరగడంతో పాటు న్యూట్రలైజింగ్ సామర్ధ్యం పెరుగుతుందని స్పష్టం చేశారు. సింగిల్ డోసు పూర్తయిన తరువాత పరిశీలిస్తే పెద్దగా మార్పు లేదని అర్జెంటీనా పరిశోధన నివేదిక తెలిపింది. కేవలం సింగిల్ డోసుతోనే (Single dose Sputnik v ) 94 శాతం ప్రభావం కన్పిస్తోందని..అందుకే రెండవ డోసుతో పెద్దగా మార్పు లేదని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధన నేపధ్యంలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ డిమాండ్ మరింతగా పెరగనుంది. 


Also read: Fire Accident: ఇరాక్ కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం, 52 మంది మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook