Srilanka Food Crisis:శ్రీలంకలో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకలో జనాలకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఆకలితో అలమటిస్తూ జనాలు చనిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశంలో ఆహార సంక్షోభంపై శ్రీలంక ప్రధానమంత్రి విక్రమసింగే ప్రకటన చేశారు. దేశంలో ఆహార కొరత ఏర్పడుతుందని హెచ్చరించారు. ఫుడ్ ఉత్పత్తులు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పంటల సాగును పెంచడానికి అవసరమైన ఎరువులు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు ప్రధాని విక్రమసింగే. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే దేశంలో ఆహార కొరత ఏర్పడిందని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత ఏడాది ఏప్రిల్‌లో అధ్యక్షుడు గోటబయ రాజపక్సే అన్ని రసాయన ఎరువులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎరువుల దిగుబడులను తగ్గించారు. ఇదే ప్రస్తుత ఆహార సంక్షోభానికి కారణమైంది. అయితే ప్రస్తుతం ఎరువుల దిగుమతిపై నిషేదం తొలగించారు. అయినా ఇప్పటికిప్పుడు పరిస్థితులు మెరుగుపడే  సూచనలు కనిపించడం లేదు. శ్రీలంకకు సరిపడా ఎరువులు రావడం లేదు. దీంతో  మే- ఆగస్టు సీజన్ క్రాప్ కు ఎరువులు అందుబాటులో ఉండే అవకాశాలు దాదాపుగా లేవు. అయితే సెప్టెంబర్- మార్చి సీజన్ కు సరిపడా ఎరువులు, విత్తనాల నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే ట్విట్టర్ లో వెల్లడించారు. పరిస్థితిని అర్ధం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


శ్రీలంకలో ప్రస్తుతం ఇంధనం కొరత తీవ్రంగా ఉంది. పెట్రోల్ నిల్వలు నిండుకున్నాయి. దీంతో అత్యవసర సేవల కోసం మాత్రమే పెట్రోల్ అందిస్తారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. డీజిల్ మాత్రం పరిమితంగా దొరుకుతోంది. వంట గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. గ్యాస్ సిలిండర్లు ఫిల్ చేసే కేంద్రాల దగ్గర జనాలు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. చమురు సంస్థలు ధరలు భారీగా పెంచేశాయి. తమ కుటుంబ సభ్యులు తినడానికి వంటకు గ్యాస్ కోసం మూడు రోజులుగా వెయిట్ చేస్తున్నామని కొందరు చెప్పారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. ఇక డబ్బులు లేని పేదలు వంట గ్యాస్ కొనలేక.. తినడానికి తిండి లేక పస్తులు ఉంటున్నారు. కిరోసిన్ కూడా దొరకడం లేదు. గ్యాస్ , కిరోసిని లేకుండా వంట ఎలా చేయాలని.. ఏం తినాలి.. ఇలాగే చచ్చిపోతామోనని కొందరు ఆవేదనగా చెబుతున్నారు, శ్రీలంకలో ఔషదాల కొరత తీవ్రంగా ఉంది. రోగులు మందులు లేక ప్రాణాలు కోల్పోతున్నారు, ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా మందగించాయి. దుర్భర జీవితం గడుపుతున్నామని కొలంబో వాసులు చెబుతున్నారు.


మరోవైపు శ్రీలంకలో నిరనసలు మరింతగా ఊపందుకున్నాయి. ద్రవ్యోల్బణం, ఇంధనం, ఆహార కొరతకు కారణమైన అధ్యక్షుడు గోటాబయ రాజపక్స రాజీనామా చేయాలని  శ్రీలంక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.లక్షలాది మంది కొలంబోలో ఆందోళన చేస్తున్నారు. దీంతో రాజధానిలో టెన్షన్ నెలకొంది. గోటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థి సంఘాలు కొలంబోలోని అధ్యక్షుడు ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు.  పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానెన్లతో విద్యార్థులను చెదరగొట్టారు.


READ ALSO: Jr NTR fans:జూనియర్ ఎన్టీఆర్ ఇంటిదగ్గర అభిమానుల రచ్చ.. పోలీసుల లాఠీఛార్జ్


READ ALSO: Chandrababu Shock: టీడీపీకి కేఈ బ్రదర్స్ గుడ్ బై? కర్నూల్ జిల్లా తమ్ముళ్లలో కలకలం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook