Talibans: ఆఫ్ఘనిస్తాన్‌లో డెడ్‌లైన్ సమీపిస్తోంది. మరో మూడు రోజుల్లో తరలింపు ప్రక్రియ పూర్తి కావల్సిందే. అందుకే దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్లు ఇప్పుడు రోడ్లన్నీ బ్లాక్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆఫ్ఘన్(Afghanistan)పరిణామాల నేపధ్యంలో ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఆగస్టు 31 డెడ్‌లైన్‌లోగా అమెరికా ఇతర దేశాల సైనిక బలగాలు, పౌరుల్ని తరలించాల్సి ఉంది. డెడ్‌లైన్‌కు ఇంకా మూడు రోజులే మిగిలింది.కాబూల్ ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో తాలిబన్లు అదనపు బలగాల్ని మొహరించారు. విమానాశ్రయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.తాలిబన్లు దేశాన్ని ఆక్రమించినప్పటి నుంచి వేలాదిమంది ప్రజలు దేశం విడిచి వెళ్తున్న విషయం తెలిసిందే. అమెరికా సహా మిత్రదేశాలు తమ తమ దేశప్రజల్ని, ఆఫ్ఘన్ శరణార్ధుల్ని విమానాల్లో తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తమ పౌరులు ఆప్ఘనిస్తాన్‌లోనే ఉండాలని తాలిబన్లు(Talibans)హెచ్చరించారు. అదే సమయంలో మొన్న జరిగిన ఐసిస్(ISIS)కే ఘాతుకం తరువాత చెక్ పోస్టుల వద్ద భద్రత మరింత పెంచారు. విమానాశ్రయానికి వెళ్లేదారుల్లో అంచెలంచెలుగా భద్రత ఏర్పాటైంది. 


శుక్రవారం నాడు కాబూల్ విమానాశ్రయం(Kabul Airport)వద్ద ఐసిస్ కే గ్రూప్ జరిపిన వరుస బాంబు పేలుళ్ల(Bomb Blast)ఘటనలో దాదాపు 170 మంది ఆఫ్గన్ ప్రజలు, 13 మంది అమెరికన్ సైనికులు మరణించారు. దీనికి ప్రతీకారదాడిగా నంగహార్ ప్రావిన్స్‌లోని ఐసిస్ కే టెర్రరిస్టు కదలికల్ని గుర్తించిన అమెరికా(America)..వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇక ఈ అన్ని పరిణామాల నేపధ్యంలో ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే మార్గాల్ని బ్లాక్ చేస్తున్నారు తాలిబన్లు. 


Also read: West Bengal: ఈడీ సమన్లపై కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ మమతా బెనర్జీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook