Talibans on India: ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం అనంతరం తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. పొరుగుదేశం ఇండియాతో సంబంధాల విషయంలో తాలిబన్లు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. తాలిబన్లు చేసిన వ్యాఖ్యలపై ఇండియా ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాలిబన్లు(Talibans)ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన అనంతరం పొరుగుదేశాలతో దౌత్య సంబంధాలపై దృష్టి సారించినట్టు కన్పిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ప్రకటనలు చేసిన తాలిబన్లు ఇప్పుడు మరో కీలక ప్రకటన చేశారు. ఇండియాతో రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల్ని కొనసాగించాలని కోరుకుంటున్నట్టు తాలిబన్ అగ్రనేత షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్ జాయ్ తెలిపారు. ఇండియా తమకు అతి ముఖ్య దేశమని చెప్పారు. తాలిబన్ సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.  


ఆఫ్గన్ (Afghanistan)నేలను ఆక్రమించిన తరువాత తాలిబన్ అగ్రనేత స్థాయిల ఇండియాతో సంబంధాలపై మాట్లాడటం ఇదే తొలిసారి. వివిధ గ్రూపులు, రాజకీయ పార్టీలతో సంప్రదింపుల ద్వారా కాబూల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు.ఇది విభిన్న వర్గాల ప్రజల ప్రాతినిధ్యాల్ని కలిగి ఉంటుందని చెప్పారు. దాదాపు 46 నిమిషాలపాటు సాగే ఈ వీడియోలో పలు కీలకాంశాలు ప్రస్తావించారు. షరియా ఆధారంగా ఇస్లామిక్ ప్రభుత్వాన్ని(Islamic government) ఏర్పాటు చేస్తామన్నారు. ఇండియా, పాకిస్తాన్, చైనా, రష్యా సహా వివిధ దేశాలతో సంబంధాలపై కూడా అబ్బాస్ మహమ్మద్ స్పందించారు. పాకిస్తాన్ ద్వారా ఇండియాతో వాణిజ్యం చాలా ముఖ్యమైనదన్నారు.ఇరాన్ విషయాన్ని ప్రస్తావిస్తూ..ఆఫ్ఘన్‌లోని చాంబహార్ పోర్టుని(Chambahar port) ఇండియా అభివృద్ధి చేసిన అంశాన్ని గుర్తు చేశారు. 1980 ప్రారంభంలో డెహ్రాడూన్‌లోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందిన విదేశీ క్యాడెట్ల బృందంలో అబ్బాస్ మహమ్మద్ ఒకరు కావడం విశేషం. 


Also read; Afghanistan Issue: ఆఫ్ఘన్‌లో రానున్న 24-36 గంటలు అత్యంత ప్రమాదకరమని బిడెన్ హెచ్చరిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook