Afghanistan Issue: ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ విమానాశ్రయంపై దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా బలగాల ఉపసంహరణ గడువుకు మరో 24 గంటలు మిగిలున్న నేపధ్యంలో ఉగ్రదాడులు మళ్ళీ జరిగే అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హెచ్చరించారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో(Afghanistan)ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది. తాలిబన్లు(Talibans)ఆ దేశాన్ని ఆక్రమించడం, అమెరికా సైనిక బలగాలు దేశం నుంచి వెళ్తుండటంతో ఉగ్రదాడుల భయం పొంచి ఉంది. ఇప్పటికే కాబూల్ విమానాశ్రయం లక్ష్యంగా రెండుసార్లు ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ముందే హెచ్చరించారు. ఆఫ్ఘన్ నుంచి అమెరికా తన బలగాల్ని ఉపసంహరించుకునేందుకు మరో 24 గంటల గడువు మిగిలింది. ఈ క్రమంలో మరోసారి అంటే రానున్న 24-36 గంటల్లో మరోసారి ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశాలున్నాయని జో బిడెన్ మరోసారి హెచ్చరించారు.
తమ దేశానికి చెందిన కమాండర్లు చెప్పినదాని ప్రకారం రానున్న 24-36 గంటల్లో మళ్లీ దాడులు జరిగే అవకాశం అత్యధికంగా ఉందని జో బిడెన్(Joe Biden)తెలిపారు. కాబూల్ పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయన్నారు. కాబూల్‌లో ఉన్న ప్రతి అమెరికన్ సైనికుడి ప్రాణాలు రక్షించే బాధ్యత తమపై ఉందన్నారు. ఈ నేపధ్యలో ఆ దేశంలోని సైనిక బలగాలకు ఆదేశాలు జారీ చేసినట్టు బిడెన్ వెల్లడించారు. ఐసిస్ కే(ISIS K) ఉగ్రవాద సంస్థపై జరిపిన ద్రోన్ దాడి చివరిది కాదన్నారు. అమాయక ప్రజల ప్రాణాల్ని బలితీసుకున్నవారిని విడిచి పెట్టమని..పేలుళ్లు వెనుక హస్తమున్న ప్రతి ఒక్కరిపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. కాబూల్ విమానాశ్రయం(Kabul Airport)సమీపంలో దాడులు జరిగే అవకాశాలున్నందున..ఆ దరిదాపులకు ఎవరూ రావద్దని..తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అమెరికా విదేశాంగశాఖ సూచించింది. ఆ దేశంలో ఉన్న 3 వందలమంది పౌరుల్ని గడువులోగా తరలిస్తామని తెలిపింది.
Also read: Kabul Blast: కాబూల్ విమానాశ్రయంలో మరోసారి పేలుడు, ఇద్దరి మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook