Sri Lanka Crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం... దేశ వ్యాప్తంగా ఆకలి కేకలు..!
లంకలో ఎవరు ఊహించని ఆహార, ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. కరెంటు కోలతో పాటు అత్యవసర సరకుల కొరత కూడా శ్రీలంక ప్రజలను తరుముతోంది. తీవ్ర ఆహార కొరతతో ఊహించని పరిణామాలు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
Sri Lanka Crisis: శ్రీలంకలో పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు. లంకలో ఎవరు ఊహించని ఆహార, ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. కరెంటు కోలతో పాటు అత్యవసర సరకుల కొరత కూడా శ్రీలంక ప్రజలను తరుముతోంది. తీవ్ర ఆహార కొరతతో ఊహించని పరిణామాలు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ స్టేషన్లు, పెట్రోల్ బంక్‌ల వద్ద రోజుల తరబడి బారులు తీరాల్సిన పరిస్థితి నెలకొనడంతో కొందరు భారత్‌కు వలసకడుతున్నారు.
పోయిన 70 ఏళ్లలోనే శ్రీలంక అనుభవిస్తున్నది అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభమని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి సరిపడా విద్యుత్తు లేక, కరెంట్ కోతల తీవ్రతతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక వైపు ఆహార పదార్థాలు, మరో వైపు వంట గ్యాస్ వంటి నిత్యావసర సరకుల కొరత కూడా ఉంది. దీంతో ధరల మూడు రేట్లు పెరినట్లు సమాచారం. ఈ సంక్షోభంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
గ్యాస్ ధరలకు రెక్కలు రావడంతో దేశవ్యాప్తంగా 90శాతంకు పైగా హోటళ్లు మూతబడ్డాయి. ఇప్పుడు శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ.283కి చేరింది. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ గ్యాస్, పెట్రోల్ నిత్యవసరాల్లో భాగమైనందున వాటిని తప్పనిసరి పరిస్థితుల్లో కొనాలంటే రోజుల తరబడి శ్రీలంక ప్రజలు నిరీక్షిస్తున్నారు.
అయితే శ్రీలంకలోని రాజధాని కొలంబో సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంక్‌ల వద్ద వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి. పెట్రోల్ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. కిరోసిన్ కోసం క్యాన్లతో, సిలిండర్లతో గ్యాస్ స్టేషన్ల వద్ద శ్రీలంక ప్రజలు పడిగాపులు గాస్తోన్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతమందైతే రెండు, మూడు రోజులు క్యూలైన్లలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు పలు జిల్లాల్లో ఈ కొరత ఉద్రిక్తతలకు దారితీస్తోంది. పలు జిల్లాల్లో పెట్రోల్ బంక్‌ల వద్ద దాడులు జరగడంతో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పెట్రోల్ బంక్‌ల్లో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. శ్రీలంకలో నిత్యావసరాలతో పాటు కాగితాల కొరత కూడా తీవ్రంగా ఏర్పడిందని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.. దీంతో శ్రీలంక వ్యాప్తంగా జరగాల్సిన అన్ని పరీక్షలను నిరవధికంగా వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: KCR Datti Controversy: దట్టి ధరించి ఆలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్.. పలువురు ఆగ్రహం
Also Read: IPL Mystery Girl: ఐపీఎల్ లో మిస్టరీ గర్ల్స్.. ఈ సీజన్ లో ఎవరి వంతో?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook