IPL Mystery Girl: ఐపీఎల్ లో మిస్టరీ గర్ల్స్.. ఈ సీజన్ లో ఎవరి వంతో?

IPL Mystery Girl: ఈనెల 26 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గత సీజన్లలో చాలా మంది అమ్మాయిలు కెమెరా కంటపడి సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా మారారు. ఆ సెలబ్రిటీలు ఎవరనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2022, 05:43 PM IST
IPL Mystery Girl: ఐపీఎల్ లో మిస్టరీ గర్ల్స్.. ఈ సీజన్ లో ఎవరి వంతో?

IPL Mystery Girl: మరికొద్ది గంటల్లో క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (2022) 15వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఫ్రాంఛైజీలు తమ జట్లతో సిద్ధంగా ఉన్నారు. ఈసారి 25 శాతం మందిని మాత్రమే స్టేడియాల్లోకి అనుమతించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది. అయితే కరోనాకు ముందు ప్రేక్షకులు స్టేడియాల్లోకి వచ్చిన క్రమంలో.. అప్పుడు చాలా మంది అందమైన అమ్మాయిలు కెమెరా కంట పడి పాపులర్ అయ్యారు. ఐపీఎల్ లో కెమెరా కంట పడి సోషల్ మీడియాలో పాపులర్ అయిన అమ్మాయిలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

మాలతీ చాహర్

2018 ఐపీఎల్ సీజన్ మాలతీ చాహర్ అనే అమ్మాయి రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారింది. చెన్నె సూపర్ కింగ్స్ మ్యాచ్ కు ముందు కెప్టెన్ ధోనీతో ఆమె ఫొటో దిగడమే అందుకు కారణం. ధోనీతో ఫొటోలో కనిపించడం సహా ఆమె అందంగా ఉండడం వల్ల కొన్ని గంటల్లోనే విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇంతకీ మాలతీ చాహర్ ఎవరో అని అనుకుంటున్నారా? క్రికెటర్ దీపక్ చాహర్ సోదరినే ఈ మాలతీ చాహర్. 

దీపికా ఘోష్

ఐపీఎల్ 2019 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మద్దతుగా స్టేడియానికి వచ్చిన దీపికా ఘోష్.. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో కెమెరాలో కనిపించింది. దీంతో ఆమె గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడిచింది. ఎట్టకేలకు ఆమె పేరు దీపికా ఘోష్ అని నెటిజన్లు తెలుసుకున్నారు. అప్పుడే ఆమెకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల వివరాలు వైరల్ గా మారాయి. 

కావ్యా మారన్

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సపోర్ట్ చేయడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ సహయజమాని కావ్యా మారన్ ఎప్పుడూ స్టేడియంలో కనిపిస్తూనే ఉంటుంది. సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్ కుమార్తె ఈమె. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ యజమానిగా ఇప్పుడు బాధ్యతలను నిర్వర్తిస్తుంది. 

Also Read: Mumbai Indians Players: ఐదుసార్లు విజేతగా ముంబయి ఇండియన్స్.. ఈసారి టీమ్ లో ఎవరెవరు?

Also Read: Virat Kohli Join RCB: ఇన్ని సంవత్సరాలు ఐపీఎల్ ఆడుతానని అనుకోలేదు: కోహ్లీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News