కరోనా వైరస్ ( Corona virus ) ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తోంది. వైరస్ ప్రారంభమైన దేశం చుట్టూ ఏ ప్రాంతాన్నీ వదల్లేదు. ఆ ఒక్క నియంత దేశం తప్ప. ఇప్పుడా దేశంలో కూడా అడుగుపెట్టేసింది కరోనా వైరస్. తొలికేసు నమోదైంది ఆ దేశంలో.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పక్కా కారణాలు తెలియదు గానీ..ఆ నియంత దేశంలో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అలాగని ఆ దేశం ఎక్కడో ప్రపంచంలో మారుమూలన లేదు. కరోనా ప్రారంభమైన దేశానికి ఆనుకుని ఉన్న సరిహద్దు దేశమే. నియంత దేశంగా భయపెడుతోన్న నార్త్ కొరియా ( North Korea ) అది. ఇప్పటివరకూ నమోదు కాని కరోనా తొలి కేసు మొత్తానికి ఆ దేశంలో ప్రవేశించగలిగింది. తొలి కరోనా కేసు ( First corona case ) శనివారం రాత్రి వెలుగుచూసింది. కరోనా లక్షణాలున్న ఓ వ్యక్తికి పరీక్షలు చేయగా పాజిటివ్ గా తేలింది. దాంతో అధికారికంగా నార్త్ కొరియా ఈ విషయాన్ని ప్రకటించింది.


తొలి కరోనా కేసు నమోదు కావడంతో మొత్తం యంత్రాంగం అప్రమత్తమైంది. ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నార్త్ కొరియా కేసాంగ్ నగరం ( Kaesong city ) లో  వెంటనే లాక్ డౌన్ ( Lockdown ) విధించారు. దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ( North Korea president Kim jong un ) ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. వైరస్ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ యుద్దప్రాతిపదికన పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా 976 పరీక్షలు చేయగా అన్నీ నెగెటివ్ గా వచ్చాయి.కోవిడ్ 19 వైరస్ లక్షణాలున్న 25 వేల 551 మందిని క్వారెంటైన్ చేశారు. వీరిలో 255 మంది ఐసోలేషన్ లో ఉన్నారు. తొలికేసు నమోదైన నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని నార్త్ కొరియా అధ్యక్షుడు అధికార్లను ఆదేశించారు. కేసాంగ్ నగరం దక్షిణ కొరియా ( South korea ) కు సరిహద్దుల్లో ఉంది. మొన్నటివరకూ ప్రశాంతంగా ఉన్న ఆ దేశంలో ఇప్పుడు కరోనా తిరగబెడుతోంది. Also read: Los Angeles Court: నీ కోసం ఉరి శిక్ష ఎదురుచూస్తోంది అక్కడ


మరోవైపు దేశ భవిష్యత్ దృష్ట్యా చైనా సరిహద్దును ఇప్పట్లో తెరిచేది లేదని కిమ్ జోంగ్ ఉన్ స్పష్టం చేశారు. వుహాన్ నగరం ( Wuhan city ) లో కరోనా వైరస్ వెలుగుచూసినప్పటి నుంచి నార్త్ కొరియా సరిహద్దుల్ని మూసేసింది. Also read : Donald Trump: ఏం చేసినా తప్పుబట్టడం జనానికి కామన్