ముంబై ఉగ్రదాడుల ( Mumbai Attack ) కేసు ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమైంది. అది కూడా సాక్షాత్తూ అక్కడి కోర్టులో దీనిపై చర్చ సాగింది. 12 ఏళ్ల క్రితం జరిగిన దాడుల గురించి అమెరికాలో ఇప్పుడు చర్చ జరగడమేంటనే సందేహం రావచ్చు. కానీ నిజం...అదే జరిగింది.పన్నెండేళ్ల క్రితం 2008లో ముంబై ఉగ్రదాడులతో దద్దరిల్లింది. ఈ సంఘటనలో ఆరుగురు అమెరికన్లతో సహా 160 మంది మరణించారు. అప్పటి కేసు ఇంకా కొందరిని వెంటాడుతూనే ఉంది. అందుకే ఇప్పుడు అమెరికాలో ఈ కేసు చర్చకొచ్చింది. అది కూడా సాక్షాత్తూ అమెరికా కోర్టులో. వివరాలివీ… ( థ్రిల్లింగ్ కలిగించే అప్సరా రాణి హాట్ ఫోటోలు )
2008 ముంబై దాడుల కేసులో నిందితుడైన తహవుర్ రానా ( Tahawwur Rana ) పాక్ సంతతికి చెందిన కెనడా ( Canada) వ్యాపారవేత్త . ముంబై దాడుల సూత్రధారి కోల్మన్ హెడ్లీకు చిన్ననాటి స్నేహితుడు రానా జూన్ 10 న లాస్ ఏంజిల్స్ లో అరెస్టయ్యాడు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల బెయిల్ పిటీషన్ దాఖలు చేసుకున్నాడు రానా. ఇదే కేసులో భారతదేశం ఇతని కోసం ఎదురుచూస్తుండటమే కాకుండా..తమకు అప్పగించాల్సిందిగా అమెరికాను కోరింది.
ఈ నేపధ్యంలో రానాకు బెయిల్ ఇచ్చేందుకు అమెరికా కోర్టు నిరాకరించింది. రానాను ఫ్లయిట్ రిస్క్ గా భావించింది. రానా పారిపోయే అవకాశమున్నందున అతనికి బెయిల్ నిరాకరిస్తున్నట్టు లాస్ ఏంజిల్స్ ( Los Angeles) కోర్టు స్పష్టం చేసింది. ఏకంగా 24 పేజీల తీర్పునిచ్చింది కోర్టు. ఒకవేళ రానాను కెనడా వెళ్లేందుకు అనుమతిస్తే...ఇక భారత్ లో శిక్షను తప్పించుకుంటాడన్నది కోర్టు అభిప్రాయం. “ భారతదేశంలో అతని కోసం ఉరిశిక్ష ఎదురుచూస్తోందని “ కోర్టు వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేస్తే పారిపోయే ప్రమాదముందని కోర్టు భావించింది. అంతేకాకుండా రానాకు బెెయిల్ ఇస్తే అమెరికా-భారత్ సంబంధాలు దెబ్బతింటాయని యూఎస్ అసిస్టెంట్ అటార్నీ జనరల్ వాదించారు. అయితే రానా వల్ల ఎటువంటి రిస్క్ ఉండదని..1.5 మిలియన్ డాలర్ల భారీ పూచీకత్తు పెడుతున్నామని రానా న్యాయవాది వివరణ ఇచ్చారు.
హాట్ భ్యూటీ Sherlyn Chopra ఘాటు ఫోటోలు
Disha Patani: దిశా పటానీ లేటెస్ట్ ఫొటోస్