Donald Trump: ఏం చేసినా తప్పుబట్టడం జనానికి కామన్

ఎప్పుడూ వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( America President Donald Trump ) మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.  

Last Updated : Jul 24, 2020, 08:39 PM IST
Donald Trump: ఏం చేసినా తప్పుబట్టడం జనానికి కామన్

ఎప్పుడూ వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( America President Donald Trump ) మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

కరోనా వ్యాక్సిన్ ( Corona Vaccine ) విషయంలో జనం తనపై తప్పకుండా విమర్శలు చేస్తారని బహిరంగంగానే అంగీకరించారు డోనాల్డ్ ట్రంప్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా వ్యాక్సిన్ పై స్పందించారు. “ ఒకవేళ కరోనా వ్యాక్సిన్ ను నేను ముందుగా తీసుకుంటే...స్వార్ధపరుడు, అందరికంటే ముందు తాను తీసుకున్నాడంటూ జనం నన్ను అడిపోసుకుంటారు..ఆలాగని చివర్లో తీసుకుంటే..వ్యాక్సిన్ ( Vaccine ) సరిగ్గా పని చేయదనుకుంటా..అందుకే ఆఖల్లో తీసుకున్నాడని అంటారు ఏం చేసినా తప్పుపట్టడం జనానికి కామన్ “ అన్నారు ట్రంప్. Also read: Luxury Flight: అమ్మకానికి విమానం..కొనేవారే లేరు

కరోనా వైరస్ ( Corona Virus ) ను కట్టడి చేయడానికి ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ వ్యాక్సిన్ పై డోనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు జనానికి అర్ధం కావడం లేదు. అసలీ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఓ దేశాధ్యక్షుడిగా ఇలా మాట్లాడవచ్చా అంటూ పెదవి విరుస్తున్నారు. 

యూఎస్ లో ఇప్పటివరకూ 40 లక్షల వరకూ కరోనా కేసులు నమోదు కాగా..1.4 లక్షల మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు  కరోనా వైరస్ కేసులు  ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. Also read: భాష-సంస్కృతి రెండూ అంతర్భాగాలు: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Trending News