కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్నాయి. అందరి దృష్టి మాత్రం ఒక్క ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పైనే ఉంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు చివరిదశలో ఉన్నాయి. నవంబర్ నాటికి వ్యాక్సిన్ ను అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కోవిడ్ 19 కట్టడి కోసం వ్యాక్సిన్ ను వీలైనంత త్వరగా అందుబాటులో తీసుకురావడానికి అమెరికాతో సహా అన్ని అగ్రదేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా యూకేకు చెందిన ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా ( Oxford-Astrazeneca ) లు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ పైనే అందరి ఆశలు నెలకొన్నాయి. కారణం ఈ వ్యాక్సిన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో చివరిదశ ప్రయోగాల్లో ఉండటమే  కాకుండా..తొలి రెండు దశల ప్రయోగాల్లో విజయవంతమైనట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇవాళ్టి నుంచి యూఎస్ లో కూడా మూడోదశ ప్రయోగాలకు ఆ దేశం అనుమతిచ్చింది. యూఎస్ లో రెండు డోసుల్లో ఈ వ్యాక్సిన్ ను 30 వేల మందిపై పరీక్షించనున్నట్టు తెలుస్తోంది. నవంబర్ నాటికి ఈ వ్యాక్సిన్ ను ప్రజలకు అందించాలని అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ బ్రిటన్, బ్రెజిన్, దక్షిణాఫ్రికా, ఇండియాలో చివరిదశలో ఉంది. అటు జపాన్, రష్యాలో కూడా ఈ వ్యాక్సిన్ పై పరీక్షలు నిర్వహించనున్నారు. 


మరోవైపు బయోఎన్టెక్ ( Biontech ) భాగస్వామ్యంతో ఫైజర్ ( pfizer ) కంపెనీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షల డేటాను అమెరికా విశ్లేషించనుంది. Also read: Corona Tourist centre: నిజమే...కరోనా పాజిటివ్ రోగులకు మాత్రమే ఆహ్వానం