ఊరందరిదీ ఓ దారైతే..ఉలిపిరి కట్టెది మరో దారి అన్నట్టుగా ఉంది ఆ పర్యాటక ప్రాంతం వ్యవహారం. కరోనా వైరస్ దెబ్బకు అన్నీ మూతపడితే..కేవలం పాజిటివ్ పేషెంట్లకే ఆహ్వానమంటోంది ఆ టూరిస్ట్ స్పాట్..
కరోనా వైరస్ ( Corona virus ) మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలన్నీ ( Tourist centres ) బోసిపోయాయి. ప్రముఖ టూరిస్టు సెంటర్లన్నీ మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో పర్యాటక ప్రాంతాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ దశలో బ్రెజిల్ ( Brazil ) లోని పెర్నంబుకో స్టేట్ లో ఉన్న ఫెర్నాండో డి నొరాన్హా ( Fernando de noronha ) దీవి కూడా ప్రారంభం కాబోతోంది. అయితే ఈ దీవి ఎంటర్ కావాలంటే ఆంక్షలేంటో తెలుసా...సహజంగా సోషల్ డిస్టెన్సింగ్ అనో..మాస్క్ ధరించాలనో..శానిటైజర్ వినియోగమనో లేదా కరోనా టెస్ట్ చేయించుకోవడమో అనుకుంటున్నారు కదా..కానే కాదు. మరేంటి..అదే ఆశ్చర్యం కల్గిస్తోంది.
కేవలం కరోనా పాజిటవ్ పేషెంట్లు( Only corona positive patients ) మాత్రమే తమ దీవిలోకి రావాలని నిబంధన పెట్టారు ఈ టూరిస్ట్ సెంటర్ నిర్వాహకులు. అది కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పీసీఆర్ టెస్టులో వచ్చిన ఫలితాన్నే పరిగణలో తీసుకుంటారు. అంతటితో ఆగలేదు వీళ్లు. 20 రోజుల్లోపు పరీక్ష చేయించుకుని ఉండాలట. అప్పుడే ఆ షరతులమీదనే పర్యాటకుల్నిఅనుమతిస్తారు ఈ దీవిలో. ఇలా కరోనా పాజిటివ్ వారికే అని షరతులు పెట్టడంలో ఆంతర్యమేమిటో అర్ధం కాక అందరూ తలలు పట్టుకుంటున్నారు.
వాస్తవానికి కరోనా సంక్రమణకు ముందు ఈ దీవులకు లక్షలాది సంఖ్యలో టూరిస్టులు సందర్శించేవారు. ప్రపంచ ప్రసిద్ధ బీచ్ అవార్డు కూడా ఈ దీవులకు ఉంది. అంతా బాగానే ఉంది గానీ..కరోనా పాజిటివ్ వారికి మాత్రమే ఆహ్వానమనమే ఎవరికీ అర్దం కావడం లేదు. Also read: China: వివాదాలపై చైనా ఆసక్తికర వ్యాఖ్యలు.. నమ్మవచ్చా?