Link between Omicron and HIV: ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుకకు సంబంధించి కొత్త థియరీలు తెర పైకి వస్తున్నాయి. ఒమిక్రాన్ పుట్టుక మూలానికి హెచ్ఐవికి సంబంధం ఉందేమోనని పరిశోధకులు భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా పరిశోధకుల అధ్యయనంలో ఈ థియరీని బలపరిచే ఆధారాలు దొరికినట్లు చెబుతున్నారు. హెచ్ఐవికి చికిత్స తీసుకోని పేషెంట్లలో కరోనా వైరస్ మ్యుటేషన్ల కారణంగా ఒమిక్రాన్ పుట్టుకకు దారితీసి ఉండొచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా రోగ నిరోధక వ్యవస్థ తక్కువగా ఉండేవారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. హెచ్ఐవి పేషెంట్లలో రోగ నిరోధక శక్తి మరింత బలహీనంగా ఉంటుంది కాబట్టి... వారి శరీరంలో కరోనా వైరస్ ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా అది అనేకసార్లు మ్యుటేషన్ చెందుతుంది. ఒమిక్రాన్ పుట్టుకకు ఈ పరిణామాలు కారణమై ఉండొచ్చునన్న వాదన వినిపిస్తోంది.


ఒమిక్రాన్-హెచ్ఐవి కనెక్షన్‌కు బలం చేకూరుస్తున్న అంశాలు:


ప్రపంచంలోనే అత్యధిక హెచ్ఐవి కేసులు ఉన్న దేశం దక్షిణాఫ్రికా. అక్కడ దాదాపు 80 లక్షల మంది హెచ్ఐవి పేషెంట్లు ఉన్నారు. వీరిలో మూడింట ఒక వంతు మంది హెచ్ఐవికి ఎలాంటి చికిత్స తీసుకోవట్లేదు. ఇలాంటి పేషెంట్లు కరోనా బారినపడితే.. వారి శరీరంలో వైరస్ ఎక్కువ కాలం ఉండటంతో పాటు అత్యధిక మ్యుటేషన్లు జరిగే అవకాశం ఉంటుంది. దక్షిణాఫ్రికాలోనే ఒమిక్రాన్ వేరియంట్ బయటపడటంతో.. హెచ్ఐవికి, ఒమిక్రాన్ వేరియంట్‌కు ఉన్న కనెక్షన్‌పై సహజంగానే పరిశోధకుల్లో అనుమానాలు కలుగుతున్నాయి.


ఈ కనెక్షన్‌కు తగిన ఆధారాలు సేకరించే క్రమంలో దక్షిణాఫ్రికాకు చెందిన కొంతమంది హెచ్ఐవి పేషెంట్ల కేసులను పరిశోధకులు అధ్యయనం చేశారు. అందులో ఓ హెచ్ఐవి మహిళ గత 8 నెలలుగా కోవిడ్ బారి నుంచి బయటపడలేకపోతున్నట్లు గుర్తించారు. కరోనా టెస్టులు చేయించుకున్న ప్రతీసారి ఆమెకు పాజిటివ్ వస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి పేషెంట్ల శరీరాల్లో కరోనా వైరస్ సుదీర్ఘ కాలం ఆశ్రయం పొందుతూ జెనెటిక్ మ్యుటేషన్లు జరిపే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.


ఒమిక్రాన్-హెచ్ఐవి లింకును నిర్దారించేందుకు పరిశోధకులు మరింత లోతుగా అధ్యయనం జరుపుతున్నారు. హెచ్ఐవిలోని జన్యువులను సూడో వైరస్ కణంగా ఉపయోగించడం ద్వారా 32 స్పైక్ ప్రోటీన్లు కలిగిన ఒమిక్రాన్ వేరియంట్‌తో అది సరిపోలే అవకాశం ఉంటుందా అన్న దానిపై పరిశోధకుల అధ్యయనం కొనసాగుతోంది. ఈ ఫలితాలు వెల్లడైతే ఒమిక్రాన్-హెచ్ఐవి (Omicron cases) లింకుపై స్పష్టత వస్తుంది.


Also Read: Theni Nurse Murder Case: ఆ నర్సు ఇంట్లో 500 పైగా కండోమ్స్.. 150 మంది పురుషులతో అఫైర్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి