Theni Nurse Murder Case: ఆ నర్సు ఇంట్లో 500 పైగా కండోమ్స్.. 150 మంది పురుషులతో అఫైర్!

Theni Nurse Murder Case: తమళనాడులోని తేనీ జిల్లాలో సెల్వి నర్సు దారుణ హత్యకు గురైన కేసులో విస్తుపోయిన నిజాలు బయటపడ్డాయి. మృతి చెందిన సెల్వి.. దాదాపు 150 మందికి పైగా పురుషులతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఇంట్లో 500 పైగా హైక్వాలిటీ కండోమ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2021, 10:39 AM IST
    • తమిళనాడులోని తేనీ నర్సు హత్య కేసులో నమ్మలేని నిజాలు
    • నర్సు ఇంటి పరిశీలనలో 500 హైక్వాలిటీ కండోమ్స్ లభ్యం
    • 150 మందితో ఆ నర్సుకు అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు వెల్లడి
Theni Nurse Murder Case: ఆ నర్సు ఇంట్లో 500 పైగా కండోమ్స్.. 150 మంది పురుషులతో అఫైర్!

Theni Nurse Murder Case: తమిళనాడులోని తేనీ జిల్లా పప్పమ్మల్ పురంలో ఓ నర్సు దారుణ హత్యకు గురైంది. ఈ హత్య వెనుక కారణాలు తెలిసి పోలీసులు విస్తుపోయారు. ఆమె ఇంట్లో పరిశీలించగా 500 పైగా కండోమ్స్ లభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు మరిన్ని ఊహించని ట్విస్టులు ఎదురయ్యాయి.  

ఏం జరిగిందంటే?

పోలీసుల వివరాల ప్రకారం.. తమిళనాడులోని తేనీ జిల్లా అండిపట్టి సమీపంలోని పప్పమ్మల్‌పురానికి చెందిన సురేష్ దిండిగుల్‌లో క్యాటరర్‌‌గా పనిచేస్తుండేవాడు. అతని భార్య సెల్వి(43) అండిపట్టి గవర్నమెంట్ హాస్పిటల్‌లో సీనియర్ నర్సుగా పనిచేసేది. వీళ్లకు ఒక పాప, బాబు ఉన్నారు. దాదాపు 17 సంవత్సరాలుగా సెల్వి నర్సుగా పనిచేస్తోంది. 

అయితే ఇంతలోనే సురేష్, సెల్వి మధ్య విభేదాలు రావడం వల్ల విడాకులు తీసుకొని వేర్వేరుగా ఉంటున్నారు. సురేష్ దిండిగుల్‌లోనే క్యాటరర్‌గా పనిచేసుకుంటూ పిల్లలతో కలిసి అక్కడే ఉండిపోగా.. సెల్వి అండిపట్టిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటోంది.

అదే ఇంట్లో గతేడాది నవంబరు 24న సెల్వి దారుణ హత్యకు గురైంది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. వెంటనే ఆమె మృతదేహాన్ని పోస్టు మార్టానికి పంపారు. ఆధారాల కోసం పోలీసులు ఆమె ఇంటిని పరిశీలించగా.. అక్కడ 500 పైగా హైక్వాలిటీ కండోమ్స్ లభించాయి. వాటిని చూసి పోలీసులు విస్తు పోయారు. 

ఈ కేసులో భాగంగా ఆమె గురించి తెలుసుకునే క్రమంలో నమ్మలేని నిజాలు బయటకొచ్చాయి. సెల్వి.. దాదాపుగా 150 మంది పురుషులతో వివాహేతర సంబంధాలు కొనసాగించినట్లు విచారణలో తేలింది. ఆమె మొబైల్ లో 300 పైగా కాంటాక్ట్ నంబర్లు గుర్తించిన పోలీసులు.. అందులోని కొంతమంది పురుషులతో అఫైర్ నడిపినట్లు తేల్చి చెప్పారు. సెల్వితో అఫైర్ నడిపినవారిలో చాలా మంది ప్రముఖులు ఉన్నట్లు విచారణలో తెలిసింది. 

ఈ క్రమంలోనే.. గతేడాది డిసెంబర్ 9న కంబం గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచేసే రామచంద్రప్రభు (34) అనే వ్యక్తికి ఈ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానించిన పోలీసులు అతనిని విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు పంపారు. అయితే విచారణకు రమ్మని పిలిచిన తర్వాతి రోజే అంటే డిసెంబరు 10న రామచంద్ర ప్రభు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో రామచంద్ర ప్రభు ఆత్మహత్యకు, సెల్వి హత్యకు ఏదో సంబంధం ఉండి ఉంటుందన్న పోలీసుల అనుమానమే నిజమైంది. 

సెల్వి, రామచంద్ర ప్రభు మధ్య అఫైర్ నడిచిందని.. సెల్వి హత్యకు ముందు వీరిద్దరూ కలుసుకున్నారని సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా రామచంద్ర ప్రభు భార్యను పోలీసులు విచారించగా.. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని, సెల్వికి తరచుగా డబ్బు ఇచ్చేవాడని రామచంద్ర భార్య తేల్చి చెప్పింది. 

డబ్బు విషయంలో వారిద్దరి మధ్య గొడవలు జరిగి ఉండొచ్చని.. ఈ క్రమంలో అతడు హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అంచనాకు వచ్చారు. సెల్వి మరణించిన తర్వాత.. ఆమె ఇంట్లో ఉన్న ఫుట్ మార్క్స్ ఆధారంగా రామచంద్ర ప్రభు ఈ మర్డర్ చేశాడని పోలీసులు కనుగొన్నారు. తనను అరెస్టు చేస్తారనే భయంతో అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు స్పష్టం చేశారు.   

Also Read: Earthquake in Bangalore: కర్ణాటకలోని బెంగళూరులో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.3గా నమోదు

Also Read: Omicron Variant: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత, అలర్ట్ జారీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News