ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చకున్న పాపులర్ పర్యాటక ప్రాతం మచు పిచ్చు (Machu Picchu ). ప్రతీ సంవత్సరం ఈ ప్రదేశానికి లక్షలాది మంది వస్తుంటారు. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి చక్కని అనుభూతిని సొంత చేసుకుంటారు. అయితే కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ఈ ప్రాంతాన్ని పర్యాటకులను రాకుండా అధికారులు సుమారు ఆరునెలల పాటు కట్టడి చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ | Wall Colour for Wealth: గోడలకు ఈ రంగులు వేయడం వల్ల సంపద, ఆరోగ్యం కలుగుతుంది


అయితే ప్రపంచ వింతల్లో ఒకటైన ఈ ప్రదేశాన్ని చూడానికి మాత్రం ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చారు. అది కూడా దాదాపు ఆరు నెలల తరువాత. అతను ఎంత లక్కీయో అనుకుంటున్నారు కదా..మీరు అనుకున్నది నిజమే. కానీ దీని కోసం అతను చేసిన త్యాగం కూడా అలాంటిదే.


ఇతని పేరు జెస్సీ కటయామా. ఇతను జపాన్ (Japan ) దేశస్తుడు. మచు పిచ్చు సందర్శన కోసం అతను మార్చి నెలలో పెరు వెళ్లారు. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో అతను పెరులో ఇరుక్కున్నాడు.


ALSO READ | Good News: ఒక్క రుపాయితో రూ.25 లక్షలు సంపాదించే అవకాశం


కరోనా ఆంక్షల మధ్య అక్కడే చిక్కుకున్న అతను సుమారు ఆరు నెలల పాటు లాక్ డౌన్ నియమాల మధ్య దేశం కాని దేశంలో నివసించాడు. అయితే ఇటీవలే తన పరిస్థితిని స్థానిక అధికారులకు తెలిపాడు. దాంతో అధికారులు అతనికి ప్రత్యేక పర్మిషన్ ఇచ్చి .. మచు పిచ్చు చూడటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


దీంతో ఒంటరిగానే ట్రెక్కింగ్ చేసి వెళ్లిన అతను ఇలా ఫోటోతో ప్రపంచాన్ని పలకరించాడు. ఇతని త్యాగానికి తగిన గుర్తింపు తెచ్చుకున్నాడు. 


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR