Zero Coronavirus Cases | అదొక వింత ప్రాంతం. ప్రపంచం మొత్తం కరోనావైరస్ తో ఇబ్బంది పడుతోంటే.. అక్కడి ప్రజలు మాత్రం ఏ మాత్రం భయం లేకుండా ఉన్నారు. వారి కళ్లల్లో భయం లేదు. వారి ఆలోచనలో కూడా కరోనా వైరస్ ( Coronavirus ) అంటే భయం లేదు. మరి అంత నిర్భయంగా ఉన్న ప్రాంతమేంటి.. వారి ధైర్యానికి కారణం ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Winter Foods For Dry Skin: చలికాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే పాటించాల్సిన డైట్


ఆ ప్రాంతం కెనడాలో ( Canada ) ఉంది. దాని పేరు నునావత్ ( Nunavut ).ఇక్కడ సుమారు 36,000 మంది నివసిస్తుంటారు. చుట్టూ నీలీ నీలీ ఆకాశం. నీళ్లు కూడా నీలి రంగులో చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. 


కెనడాపై కూడా కరోనావైరస్ ప్రభావం పడింది. అయితే కెనడాలోని ఉత్తర భాగంలో మాత్రం కరోనావైరస్ జాడ లేకుండా ఉంది. ఈ ఇక్కడ కొన్ని ప్రాంతల్లో ప్రజలు ఎలాంటి ట్యాక్స్ లేకుండా హ్యాప్పీగా బతికేస్తారు.



Also Read | Amazon Web Services: హైదరాబాద్‌లో అమేజాన్ 20 వేల పెట్టుబడులు


మార్చి నెలలో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కోవిడ్ -19 ( Covid-19 ) కేసులు పెరిగాయి. దాంతో అనేక దేశాలు తమ దేశాల సరిహద్దులను మూసివేశాయి. ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ఉన్న దేశాలతో అత్యవసర సేవల మినహా ఏ ఇతర సర్వీసులను కొనసాగించలేదు.


నునావత్ లో కూడా ఇలాంటి చర్యలే తీసుకున్నారు. అక్కడి అధికారులు కఠినమైన చర్యలు తీసుకున్నారు. ప్రజలు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని అధికారులు చెప్పింది చేశారు. దాని ఫలితమే ఇప్పటి వరకు అక్కడ ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు.



Also Read | ATM Centerలో జ్యూస్ పార్లర్..మహారాష్ర్టలో వింత వ్యాపారం


ఇందులో గొప్పేం ఉంది అని మీకు అనిపించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు లాక్ డౌన్ వంటి చర్యలు తీసుకున్నాయి. కానీ కరోనావైరస్ నుంచి పూర్తిగా సురక్షితంగా ఉండగలిగాయా ? లేదు కదా.. అందుకే నునావత్ ఈ విషయంలో గ్రేటేగా మరి.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR