'కరోనా వైరస్'విస్తరిస్తున్న నేపథ్యంలో అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో  ఇదే పరిస్థితి నెలకొంది. లాక్ డౌన్ కారణంగా ఎవరూ ఆఫీసులకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కంపెనీలు ఆర్ధికంగా చితికిపోతున్నాయి. మరికొన్ని కంపెనీలు మాత్రం అనుకూలంగా ఉన్న 'వర్క్ ఫ్రమ్ హోం' అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ ఇప్పటికీ లొంగి రావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలకు మాంద్యం భయం పట్టుకుంది. ఈ క్రమంలో ప్రముఖ సోషల్ మీడియా  వెబ్ సైట్ ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులు ఇప్పటి నుంచి పూర్తిగా ఇంటి నుంచే పని చేసుకోవచ్చని తెలిపింది. దీంతో ప్రపంచంలో పూర్తిగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ ప్రకటించిన తొలి సంస్థగా రికార్డు సృష్టించింది. ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే ఈ విషయాన్ని ప్రకటించగానే ఆ సంస్థ ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 


కరోనా మహమ్మారి నుంచి తమ ఉద్యోగులను కాపాడుకునేందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్ లో వెల్లడించింది. మరోవైపు ఇప్పటికే ఫేస్ బుక్, గూగుల్ లాంటి సంస్థలు తమ ఉద్యోగుల్లో చాలా మందిని ఇంటి నుంచే పని చేయాలని సూచించాయి. ఈ ఏడాది చివరి వరకు వారికి వర్క్ ఫ్రమ్ హోం ఇస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. తాజాగా ట్విట్టర్ తీసుకున్న నిర్ణయం మాత్రం కార్పొరేట్ చరిత్రలోనే సంచలనంగా మారింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..