USA: అమెరికాలో గాలిలో ఢీకొన్న రెండు విమానాలు: 8 మంది మృతి
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రెండు విమానాలు పరస్పరం గాలిలోనే ఢీ కొనడంతో 8 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరి మృతదేహాల్ని వెలికి తీశారు. మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది.
అమెరికాలో (America) ఘోర విమాన ప్రమాదం (planes crash) చోటుచేసుకుంది. రెండు విమానాలు పరస్పరం గాలిలోనే ఢీ కొనడంతో 8 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరి మృతదేహాల్ని వెలికి తీశారు. మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికాలోని ఇదాహో ( Idaho state) రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. గాలిలో ఢీ కొొన్న తరువాత రెండు విమానాలు కోయర్ డీ అలెన్ సరస్సులో కూలిపోయినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.మృతుల్లో పిల్లలు, పెద్దవాళ్లు కూడా ఉన్నారని సమాచారం. అయితే ప్రమాదానికి కారణాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. సరస్సులో మునిగిపోయిన విమాన శకలాల్ని సోనార్ సహాయంతో గుర్తించారు. విమాన ప్రమాదంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. Also read: China Troops At LAC: భారత్ దెబ్బకు వెనక్కి తగ్గిన చైనా, గుడారాలతో సహా!
రెండింటిలో ఒకటి సెస్నా206 గా గుర్తింపు:
ప్రమాద సమయంలో ప్రయాణీకులు, క్రూ సిబ్బంది అందరూ మృతి చెందినట్టు తెలుస్తోంది. గాలిలో రెండు విమానాలు ఢీ కొన్న తరువాత ఇదాహో రాష్ట్రంలోని పౌడర్ హార్న్ బే ( powderhorn bay) సమీపంలో ఉన్న కోయిర్ డి అలెన్ సరస్సు ( Coeur d Alene lake ) లో కూలిపోయాయి. ఢీ కొన్న రెండు విమానాల్లో ఒకటి సెస్నా206 ( Cessna206) గా గుర్తించారు. మరో విమానాన్ని ఇంకా గుర్తించలేదు. క్రాష్ అయిన రెండు విమానాల శకలాల్ని సరస్సు నీటిలో 127 అడుగుల లోతులో కనుగొన్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..