Uganda: అంధుల పాఠశాలలో అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం.. మృతుల్లో చిన్నారులు..
Uganda: అంధుల పాఠశాలలో మంటలు చెలరేగి 11 మంది మృతి చెందిన ఘటన ఉగాండాలో జరిగింది. ఇందులో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.
Fire at Uganda School for the Blind: ఉగాండాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సెంట్రల్ ఉగాండాలోని అంధుల పాఠశాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 11 మరణాలు నిర్ధారించబడ్డాయని..మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని ఉగాండా పోలీస్ ఫోర్స్ ట్విట్టర్‌లో తెలిపింది.
రాజధాని కంపాలాకు ఆగ్నేయంగా ఉన్న ముకోనోలోని సలామా అంధుల పాఠశాలలో తెల్లవారుజామున 1 గంట సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అయితే బాధితులందరూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులా కాదా అనేది పోలీసులు స్పష్టత నివ్వలేదు. సలామా బ్లైండ్ స్కూల్ 1999 ఏప్రిల్ లో నిర్మించారు. 6 నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు, యవకులు ఇక్కడ చదువుకుంటున్నారు.
చనిపోయిన వారిలో ఎక్కువ మంది పాఠశాలలోని పిల్లలే ఉన్నట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి జనరల్ కహిందా ఒటాఫైర్ చెప్పారు. మృతుల తల్లిదండ్రులకు సానుభూతి తెలియజేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణం తెలుసుకుంటున్నామని.. ఇందులో ఎవరైనా దోషులుగా తేలితే వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన అన్నారు.
గతంలో జరిగిన అగ్ని ప్రమాదాలు..
ఇటీవల కాలంలో ఈ తూర్పు ఆఫ్రికా దేశంలోని పాఠశాలల్లో అగ్నిప్రమాదాలు పెరిగిపోయాయి. 2018 నవంబరులో దక్షిణ ఉగాండాలోని బోర్డింగ్ స్కూల్‌లో జరిగిన అనుమానాస్పద కాల్పుల్లో 11 మంది బాలురు చనిపోగా.. మరో 20 మంది గాయపడ్డారు. ఏప్రిల్ 2008లో ఉగాండా రాజధానికి సమీపంలోని జూనియర్ పాఠశాలలో యెుక్క వసతి గృహంలో అగ్నిప్రమాదం సంభవించి 18 మంది బాలికలు సజీవదహనమయ్యారు. మార్చి 2006లో, పశ్చిమ ఉగాండాలోని ఇస్లామిక్ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు.
Also Read: Indonesia boat fire: ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. పడవలో మంటలు చెలరేగి 14 మంది మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook