Russia Ukraine War: రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ తరువాత రష్యా టార్గెట్ ఏ దేశం..ఏ దేశంపై దాడి చేయవచ్చు. నిఘా వర్గాలు ఏమంటున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో యూకే..ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలవడాన్ని రష్యా జీర్ణించుకోలేకపోతోంది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తోంది. రష్యా ప్రతీకార ఆలోచనల నేపధ్యంలో నిఘావర్గాలు బ్రిటన్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. ప్రతీకారం తీర్చుకునేందుకు రష్యా..యూకేపై దాడి చేయవచ్చనేది నిఘా వర్గాల హెచ్చరిక.


ది సన్‌లో ప్రచురితమైన ఓ రిపోర్ట్ ప్రకారం బ్రిటన్ కౌంటర్ ఇంటెలిజెన్స్, భద్రతా ఏజెన్సీ MI5కు చెందిన ప్రత్యేక అధికారులు హోమ్ సెక్రటరీ ప్రీతి పటేల్‌కు రష్యా ఆర్మీ దాడుల ప్రమాదం ఉందని సమాచారం అందించారు. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీవ్ బార్కలేకు కూడా సమాచారమందించారు. యూకేపై ప్రతీకారం తీర్చుకునేందుకు రష్యన్ ఆర్మీ దాడులు చేయవచ్చని నిఘా ఏజెన్సీ హెచ్చరించింది. యూకేకు చెందిన నిఘా వర్గాలన్ని ఆప్రమత్తమయ్యాయి. యూకేను అవమానపర్చేందుకే రష్యా దాడులు చేయవచ్చని తెలుస్తోంది.


రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్‌కు యూకే మద్దతిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌కు మద్దతుగా యూకే..ఇప్పటికే ఆయుధాలు పంపించింది. దాంతో రష్యాకు కోపమొచ్చింది. యుద్దంలో జరిగిన నష్టాన్ని రష్యా నుంచి వసూలు చేయాలని ఇటీవల యూకే ప్రదాని బోరిస్ జాన్సన్ సూచించారు. ఉక్రెయిన్‌కు యూకే ఇప్పటి వరకూ 10 వేల కంటే ఎక్కువ యాంటీ ట్యాంక్ ఆయుధాలు పంపించింది. అటు ఉక్రెయిన్ సైనికులు కూడా యూకే సహాయంపై ప్రశంసలు కురిపించారు. బ్రిటన్ మహారాణి తరపున అందిన అద్భుతమైన బహుమానమని కొనియాడారు. ఈ క్రమంలో పుతిన్ ఆర్మీ యూకేపై దాడి చేయవచ్చనేది నిఘా వర్గాల హెచ్చరిక.


Also read: Viral News: తన మూత్రాన్ని తానే తాగుతున్న యువకుడు... ఇది 'నిత్య యవ్వన' సీక్రెట్ అట...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook