యూకే చట్టసభలో `పోర్న్` చూసేందుకు ప్రతి రోజూ 160 విన్నపాలు
యూకే రాజకీయ నాయకులు అశ్లీలతకు అలవాటు పడ్డారు. చట్టసభలో అశ్లీల వెబ్సైట్లు చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
యూకే రాజకీయ నాయకులు అశ్లీలతకు అలవాటు పడ్డారు. చట్టసభలో అశ్లీల వెబ్సైట్లు చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు పార్లమెంట్‌లో ఉన్న కంప్యూటర్ల నుంచి అశ్లీల వెబ్సైట్ల యాక్సెస్ పొందేందుకు మొత్తం 24,473సార్లు ప్రయత్నించారని బ్రిటన్ యొక్క ప్రెస్ అసోసియేషన్ (పీఏ) వెల్లడించింది. ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పేరిట పీఏ ఈ సమాచారం సేకరించింది. గతేడాది 2017 జూన్-డిసెంబర్ వరకు అశ్లీల వెబ్సైట్ల యాక్సెస్ ఇవ్వాలని రోజుకు 160 విన్నపాలు వచ్చాయని తెలిపింది.
ప్రధానమంత్రి థెరిసా మే ఇప్పటికే వెస్ట్ మినిస్టర్‌లో లైంగిక ఆరోపణల ఎదుర్కొంటున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 2008లో డామియన్ గ్రీన్ తన వెస్ట్ మినిస్టర్ కార్యాలయంలో కంప్యూటర్‌లో పోర్నోగ్రఫీ చూసి.. పోలీసులను తప్పుదారి పట్టించిన కారణంగా గత నెలలోనే ఆ మంత్రిని బర్తరఫ్ చేసింది.
పార్లమెంట్ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను ఎంపీలు, ఎగువ సభలోని లార్డ్స్, వారి సిబ్బంది ఉపయోగిస్తున్నారు. వారు అశ్లీల వీడియోలు చూడటానికి ప్రయత్నిస్తే బ్లాక్ చేస్తున్నాము అని అధికారులు వెల్లడించారు. పార్లమెంటు 2016లో 113,208సార్లు ఈ ప్రయత్నాలను అడ్డుకుంది. అంతకు ముందు సంవత్సరం 213,020 సార్లు ఈ ప్రయత్నాలను అడ్డుకుంది. "అన్ని అశ్లీల వెబ్సైట్లు పార్లమెంట్ కంప్యూటర్ నెట్వర్క్ ద్వారా బ్లాక్ చేయబడ్డాయి' అని ఒక పార్లమెంటరీ ప్రతినిధి పీఏకు చెప్పారు.