Thames river: ఇంగ్లండ్‌లో చలిపులి గజగజలాడిస్తోంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో అతి కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఫలితంగా నదులు..సరస్సులు గడ్డకట్టేస్తున్నాయి. ప్రఖ్యాత థేమ్స్ నది తొలిసారి గడ్డకట్టుకుపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లండ్ ( England )‌లో ఇప్పుడు చూస్తున్న చలి దాదాపు 60 ఏళ్ల కనిష్టంగా చెబుతున్నారు. చలిపులి మొత్తం దేశాన్ని గజగజ వణికిస్తోంది. చలిగాలుల ( Cold winds ) తీవ్రతకు ఇంగ్లండ్ జనం చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. మరోవైపు చలిగాలుల వేగం కూడా గంటకు 50 కిలోమీటర్ల మేర ఉండటంతో ఎక్కడికక్కడే స్థంబించుకుపోతోంది. రావెన్స్‌వర్త్, న్యూయార్క్ షైర్‌లలో రాత్రికి రాత్రే ఉష్ణోగ్రత మైనస్ 15 డిగ్రీలకు పడిపోయిందంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకవచ్చు. రహదారులు, వీధుల్లో 4 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది.


సౌత్ కుంబ్రియాలోని అల్డింగ్‌హమ్ బీచ్ పూర్తిగా ఘనీభవించింది. కేంబ్రిడ్జ్ షైర్‌లోని గ్రేట్ ఔసీ నదిలో పడవలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ప్రతికూల వాతావరణం కారణంగా డేవన్, కార్న్‌వాల్, స్కాట్లండ్‌లో కార్చిచ్చు రగలడంతో అగ్నిమాపక దళాలకు రంగంలో దిగి మంటల్ని నియంత్రించాయి. ఇక ప్రఖ్యాత థేమ్స్ నది ( Thames river ) ఇంగ్లండ్ చరిత్రలో దాదాపుగా 60 ఏళ్ల తరువాత గడ్డకట్టింది. గడ్డకట్టిన థేమ్స్ నది ( Thames river frozen )పై పక్షులు సేదతీరుతున్నాయి. 1963 తరువాత థేమ్స్ నది గడ్డ కట్టడం ఇదే తొలిసారి.


Also read: Apple 1 computer: యాపిల్ మొట్టమొదటి కంప్యూటర్ ధర ఇప్పుడెంతో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదంరాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook