Apple 1 computer: యాపిల్ మొట్టమొదటి కంప్యూటర్ ధర ఇప్పుడెంతో తెలుసా

Apple 1 computer: ఆపిల్ అంటేనే ఒక బ్రాండ్. ప్రస్టేజ్ సింబల్ కూడా. అందుకే ఆ కంపెనీ ఫోన్‌లు గానీ..వాచ్‌లు గానీ..ల్యాప్‌టాప్‌లు గానీ అంత ధర పలుకుతుంటాయి. ఆపిల్ ఆపిలే కదా..పాతకాలం నాటి యాంటిక్ పీస్ కూడా నిర్ఘాంతపోయే ధర పలుకుతోంది మరి.

Last Updated : Feb 11, 2021, 09:42 PM IST
Apple 1 computer: యాపిల్ మొట్టమొదటి కంప్యూటర్ ధర ఇప్పుడెంతో తెలుసా

Apple 1 computer: ఆపిల్ అంటేనే ఒక బ్రాండ్. ప్రస్టేజ్ సింబల్ కూడా. అందుకే ఆ కంపెనీ ఫోన్‌లు గానీ..వాచ్‌లు గానీ..ల్యాప్‌టాప్‌లు గానీ అంత ధర పలుకుతుంటాయి. ఆపిల్ ఆపిలే కదా..పాతకాలం నాటి యాంటిక్ పీస్ కూడా నిర్ఘాంతపోయే ధర పలుకుతోంది మరి.

పాతకాలం నాటి అంటే కంప్యూటర్ వచ్చిన తొలినాళ్లలో ఆపిల్ ( Apple ) కంపెనీ ప్రవేశపెట్టిన కంప్యూటర్ చూస్తే ఆశ్చర్యపోతారు. చాలా విచిత్రంగా ఉంటుంది. చెక్కకేసుతో తయారు చేసింది కంపెనీ దీన్ని. 1976లో ఆపిల్ కంపెనీ ఈ కంప్యూటర్‌ ( Apple computer )ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని పేరు ఆపిల్ 1 ( Apple 1 ). కంపెనీ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్‌లు కలిసి 1976లో రూపొందించారు. ఆపిల్ సంస్థకు చెందిన తొలి కంప్యూటర్ ఇది. అమెరికాకు చెందిన కృష్ణ బ్లేక్ అనే వ్యక్తి 1978లో ఈ ఆపిల్ 1 కంప్యూటర్‌ను అప్పట్లో 666  డాలర్లకు కొనుగోలు చేశారు. ఈ  కంప్యూటర్ ఇంకా పనిచేస్తోంది.

చెక్క కేసుతో తయారు చేసిన ఈ కంప్యూటర్ ఇప్పుడు యాంటిక్ పీస్‌గా అమ్మకానికి ఉంది. ధర ఎంతో తెలుసా. ఏకంగా 15 లక్షల  డాలర్లు. భారతీయ కరెన్సీలో 11 కోట్ల రూపాయలు. 1976లో ధర కంటే ఏకంగా 2 వేల 250 రెట్లు ఎక్కువ. షిప్పింగ్ ఛార్జెస్ అదనం. ఆ ఛార్జెస్ 450 డాలర్లు అంటే మరో 32 వేలు. ఎవరైనా విదేశీయులు కొనుగోలు చేయాలనుకుంటే అంతర్జాతీయ ఛార్జీలు వర్తిస్తాయి. కంప్యూటర్‌ ( Old Computer )తో పాటు ఎలా వాడాలో తెలిపే యూజర్ మ్యాన్యువల్ బుక్ కూడా ఉంది. ఇది చాలా పురాతనమైంది, విలువైన వస్తువు కాబట్టి దొంగిలించే ప్రమాదముందని..ఫ్లోరిడా బ్యాంక్ ఖజానాలో భద్రపర్చినట్టు కృష్ణ బ్లేక్ తెలిపారు. అంత ధర చెల్లించి కొనుగోలు చేసేవారెవరో వేచిచూద్దాం మరి. 

Also read: India ఆధిపత్యం కొనసాగించాలని ఆకాంక్షిస్తున్న Joe Biden ప్రభుత్వం, కీలక అంశాలపై చర్చ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదంరాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News