Volodymyr Zelensky: లొకేషన్‌తో సహా ఎక్కడున్నాడో చెప్పిన ఉక్రెయిన్ అధ్యక్షుడు!
Volodymyr Zelensky: రష్యాకు బయపడి దేశం విడిచి పారిపోయాడని, బంకర్లో దాక్కున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలన్స్కీ. ఈ మేరకు తాను ఎక్కడ ఉంటున్నానో చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు.
Volodymyr Zelensky: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతునే ఉంది. ఉక్రెయిన్‌లోని వివిధ నగరాలపై రష్యా దాడులు చేస్తూనే ఉంది. రాజధాని నగరం కీవ్ సహా వివిధ ప్రాంతాలపై రష్యా బాంబు దాడులు చేస్తూ.. ఉక్రెయిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఉక్రెయిన్ కూడా సమర్థంగా రష్యాను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోంది. బాంబులు పడుతున్నా తమ దేశాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది.
అయితే రష్యా దాడులకు బయపడి ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలన్స్కీ బంకర్లో దాక్కున్నాడని.. దేశం విడిచి పారిపోయాడని వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ వస్తున్నారు జలన్‌స్కీ. తాజాగా తాను ఎక్కడికి పారిపోలేదంటూ.. బంకర్లో లేనంటూ.. చెబుతూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తాను ఉంటున్న లొకేషన్ కూడా షేర్ చేశారు.
రాజధాని కీవ్‌లో అధికారిక కారక్యాలయంలో ఉన్నానంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు.
'నేను ఎక్కడా దాక్కోలేదు. బాంకోవా స్ట్రీట్‌లో అధికారిక ఆఫీస్‌లో ఉన్నాను. నేను ఎవరికి బయపడటం లేదు. దేశం యుద్ధంలో గెలిచేందుకు అవసరమైనంతా చేస్తాం.' అని రాసుకొచ్చారు జెలన్స్కీ.
యుద్ధ భయాలు..
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే యుద్ధం కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌లో చాలా మంది ప్రజలు తమను తాము కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తుండగ.. మరికొంత మంది తుపాకులు చేతపట్టి రష్యాపై పై యుద్ధానికి సిద్ధమవుతున్నారు.
ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీక ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇక ఈ రెండు దేశాల మధ్య యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రష్యాను కట్టడి చేసేందుకు ఐరోపా దేశాలు, అమెరికా కఠన ఆంక్షలు విధిస్తున్నాయి. అయినప్పటికీ రష్యా మాత్రం యుద్ధం కొనసాగుతుందని చెబుతోంది.
Also read: Russia Ukraine War Pics: యుద్ధంతో ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితి..శాటిలైట్ చిత్రాలు
Also read: Indian in Ukraine Army: యుద్ధ సమయంలో ఉక్రెయిన్ ఆర్మీలో చేరిన భారత విద్యార్థి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook