China apps: భారత్ బాటలో అమెరికా.. చైనా యాప్స్ నిషేధం
లడఖ్‌లోని గాల్వన్ లోయలో హింసాత్మక ఘర్షణకు పాల్పడి 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న డ్రాగన్ చైనాకు బ్యాడ్ టైం మొదలైంది. భారత్ (India) తరువాత ఇప్పుడు అమెరికా (United States) కూడా చైనా యాప్‌లను (china apps) నిషేధించడానికి తీవ్రంగా సన్నాహాలు చేస్తోంది.
US vs China: వాషింగ్టన్: లడఖ్‌లోని గాల్వన్ లోయలో హింసాత్మక ఘర్షణకు పాల్పడి 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న డ్రాగన్ చైనాకు బ్యాడ్ టైం మొదలైంది. భారత్ (India) తరువాత ఇప్పుడు అమెరికా (United States) కూడా చైనా యాప్‌లను (china apps) నిషేధించడానికి తీవ్రంగా సన్నాహాలు చేస్తోంది. టిక్‌టాక్‌తో సహా చైనాకు చెందిన అన్ని సోషల్ మీడియా యాప్‌లను నిషేధించడానికి తీవ్రంగా పరిశీలిస్తున్నామని, తుది నిర్ణయం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకోవాల్సి ఉందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీయో (Mike Pompeo) పేర్కొన్నారు. పాంపీయో సోమవారం ఫాక్స్ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై మరింత స్పష్టతనిచ్చారు. గాల్వన్ లోయలో హింస తరువాత భారత ప్రభుత్వం (Govt of India) టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లను నిషేధించింది. అయితే కరోనావైరస్ పుట్టుకకు చైనానే కారణమంటూ మొదటినుంచి ఆ దేశంపై మండిపడుతున్న అమెరికా కూడా భారత్ వలె డ్రాగన్ యాప్‌లను నిషేధించి డబుల్ స్ట్రోక్ ఇవ్వాలని చూస్తోంది. Also read: WHO: కోవిడ్ 19 వ్యాక్సీన్ అప్పుడే రాదు
ఆస్ట్రేలియాలో కూడా..?
ఆస్ట్రేలియా (Australia) లో కూడా చైనా యాప్‌ల నిషేధానికి కసరత్తులు జరుగుతున్నట్లు సమాచారం. ఎందుకంటే అక్కడ కూడా గత కొంతకాలం నుంచి చైనీస్ యాప్స్ నిషేధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో మరికొన్ని దేశాలు కూడా ఈ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆర్థికపరంగా, సరిహద్దుల విషయంలో చైనా చాలా దేశాలకు పెద్ద సమస్యగా మారింది. Also read: Trump on China: చైనా వల్లే ప్రపంచానికి తీరని నష్టం: ట్రంప్
టిక్‌టాక్‌కు రెండో అతిపెద్ద మార్కెట్..
టిక్‌టాక్‌కు భారత్ తర్వాత అమెరికా రెండో అతిపెద్ద మార్కెట్. టికెట్‌కాక్‌కు భారత్ నుంచి సుమారు 20 కోట్ల మంది యూజర్లు ఉండగా.. అమెరికాలో 4.54 కోట్ల మంది ఉన్నారు. టిక్‌టాక్‌ను భారత్‌లో నిషేధించడం వల్ల చైనా కంపెనీకి ఆరు బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని ఒక నివేదిక పేర్కొంది. అయితే అమెరికాలో కూడా యాప్‌ల బ్యాన్ జరిగితే డ్రాగన్‌కు ఆర్థికంగా కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos