అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) నవంబర్ 3వ తేదీన జరిగే ఎన్నికలకు ముందే ఫ్లోరిడాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారం ( Election Campaign ) మొదలుపెట్టడానికి ముందే ఫ్లోరిడాలో ఓటు వేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Covid-19 Vaccine: కరోనా అంతం అసంభవం అంటున్న బ్రిటిష్ శాస్త్రవేత్త


డెమాక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న ట్రంప్ ఓటు వేసిన తరువాత చిరునవ్వు చిందిస్తూ..నేను ట్రంప్ అనే పేరుగల వ్యక్తికి ఓటు వేశాను అని తెలిపాడు. గత సంవత్సరమే ట్రంప్ తన నివాసాన్ని ఫ్లోరిడాకు మార్చుకున్నారు. అక్కడే తను ఓటరుగా నమోదు చేయించుకున్నాడు.


లైబ్రెరీలో ఓటింగ్
డోనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని లైబ్రెరీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వెస్ట్ పామ్ బీచ్ లో ఉన్న లైబ్రెరీని పోలింగ్ కేంద్రంగా మార్చారు. కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వల్ల సుమారు 55 మిలియన్ల మంది అమెరికన్ పౌరులు ముందస్తుగానే ఓట్లు వేశారు. ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత ట్రంప్ మాట్లాడుతూ ఇది చాలా సేఫ్ ఓటు. నిజానికి ఇది బ్యాలెట్ పంపించడం కన్నా సురక్షితమైన విధానం అని తెలిపారు. 


Also Read | Keerthy Suresh: కీర్తి సురేష్ మిస్ ఇండియా ట్రైలర్ విడుదల



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR