Pfizer vaccine: కరోనా వైరస్ మహమ్మారితో వణికిపోతున్న అమెరికన్లకు ఊరట లభించనుంది. ఫైజర్ వ్యాక్సిన్‌ను ఎఫ్‌డీ‌ఏ ఆమోదం తెలిపింది. మరోవైపు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్...దిగిపోయే ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ ( Corona virus ) బారిన పడిన దేశాల్లో అత్యధికంగా ప్రభావితమైంది అగ్రరాజ్యం అమెరికా. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ( Corona second wave ) ఆ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ నేేపధ్యంలో అమెరికన్ కంపెనీ ఫైజర్ అభివృద్ది చేసిన వ్యాక్సిన్‌ను అమెరికా ఎఫ్‌డీ‌ఏ ఆమోదం తెలిపింది.  కోవిడ్ వైరస్ అంతం చేసేందుకు ఫైజర్-బయోన్టెక్ వ్యాక్సిన్‌ ( Pfizer-Biontech vaccine ) ను అత్యవసర వినియోగానికి ఆమోదిస్తున్నామని..ఎఫ్‌డీఏ ( FDA ) ఛీఫ్ సైంటిస్ట్ డెనైజ్ హింటన్ ప్రకటించారు. దాదాపు 8-9 గంటల సేపు జరిగిన చర్చల అనంతరం వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపారు. ఇక వ్యాక్సిన్ తొలిడోసుని అమెరికాలో 24 గంటల్లో ఇవ్వనున్నారు.


కీలకమైన ఎఫ్‌డీ‌ఏ ఆమోదం తెలుపడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) కీలకమైన ప్రకటన చేశారు. అమెరికన్లు అందరికీ ఫైజర్ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనున్నామని ట్రంప్ వెల్లడించారు. కేవలం 9 నెలల్లో సాధించిన అద్భుత విజయమని..నిజంగా శుభవార్త అని ట్రంప్ వ్యాఖ్యానించారు. సైన్స్ పరంగా చరిత్రలో ఇదొక చారిత్మాత్మక సందర్బమని చెప్పారు. అయితే తొలి వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలనేది ఆయా రాష్ట్రాల గవర్నర్లే నిర్ణయిస్తారని చెప్పారు. వయోవృద్ధులు, ఆరోగ్య కార్యకర్తలు..వ్యాక్సిన్ అందుకునేవారిలో తొలి వరుసలో ఉంటారన్నారు. అత్యంత కఠినమైన పరీక్షల అనంతరమే వ్యాక్సిన్‌కు ఆమోదం లభించిందని..24 గంటల్లోనే వ్యాక్సినేషన్ ప్రారంభం కానుందని చెప్పారు.


అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్ ( pfizer vaccine )‌కు ముందుగా అనుమతిచ్చింది యూకే రెగ్యులేటరీ కావడం విశేషం. ఫైజర్ వ్యాక్సిన్‌కు అనుమతిచ్చిన రెండవ దేశం అమెరికా.


Also read: America: కరోనా సెకండ్ వేవ్‌తో గజగజలాడుతున్న అగ్రరాజ్యం