US Visa Charges: అమెరికా వీసా ఛార్జీల్లో భారీ పెంపు, ఏ వీసా ఎంత పెరిగిందంటే
US Visa Charges: అగ్రరాజ్యం అమెరికా వెళ్లానుకునేవారికి ముఖ్య గమనిక. ఇక వీసా ఖర్చులు మరింత పెరగనున్నాయి. దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత వివిధ రకాల వీసా ఖర్చుల్ని యూఎస్ ప్రభుత్వం పెంచింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
US Visa Charges: అమెరికా వెళ్లే భారతీయులు సాధారణంగా H-1B, L-1, EB-5 వీసాలు తీసుకుంటుంటారు. ఇప్పుడు యూఎస్ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి వీసా ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో 2016లో వీసా ఛార్జీలు పెంచడమైంది. తిరిగి 8 ఏళ్ల తరువాత ఇదే ఛార్జీలు పెంచడం. పెరిగిన యూఎస్ వీసా ఛార్జీల వివరాలు తెలుసుకుందాం.
అమెరికా వెళ్లే బారతీయులకు బిగ్ షాక్. ఆ దేశం వీసా ఖర్చుల్ని ఏకంగా మూడు రెట్లు పెంచేసింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న వీసా ఛార్జీలు H-1B, L-1, EB-5లపై వర్తిస్తాయి. ఛార్జీలు పెరగడంతో పాటు వీసా సేవల్లో కూడా మార్పు రావచ్చు. రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై పెరిగిన వీసా ఛార్జీలు, ఇమ్మిగ్రేషన్ పాలసీ, అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపించనున్నాయి. సాధారణంగా అమెరికా వెళ్లే భారతీయులంతా H-1B, L-1,EB-5 వీసాల్నే ఆశ్రయిస్తుంటారు. 2016 తరువాత తిరిగి ఇదే వీసా ఛార్జీలను పెంచడం. యూఎస్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది.
H1B వీసా ఛార్జీలు ఏ మేరకు పెరిగాయి
హెచ్ 1బి వీసా కోసం అప్లే చేయాలంటే ఫామ్ I-129 నింపాల్సి ఉంటుంది. ఈ ఫీజు ఇప్పుడు 460 యూఎస్ డాలర్ల నుంచి 780 యూఎస్ డాలర్లకు పెరిగింది. అదే భారతీయ కరెన్సీలో లెక్కగడితే 38 వేల నుంచి 64 వేలకు పెరిగింది. అదే విధంగా హెచ్ 1బి రిజిస్ట్రేషన్ కూడా 829 రూపాయల్నించి 17 వేలకు పెరిగింది. హెచ్ 1 బి అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. ఈ వీసా ప్రకారమే అమెరికా కంపెనీలు ఉద్యోగుల్ని నియమించుకుంటాయి.
L-1 వీసా ఛార్జీల పెరుగుదల ఇలా
ఏప్రిల్ 1 నుంచి అంటే రేపట్నించి ఎల్ 1 వీసా ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 460 డాలర్లు అంటే 38 వేలుగా ఉన్న ఫీజు ఇకపై 1385 డాలర్లు అంటే 1,10 వేలకు చేరనుంది. ఇది కూడా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా కేటగరీలో వస్తుంది. ఒకే కంపెనీలో పనిచేసే ఉద్యోగుల అంతర్గత బదిలీలకు ఇది వర్తిస్తుంది. మల్టీ నేషనల్ కంపెనీలు కొందరు ఉద్యోగుల్ని ఈ వీసా ద్వారా అమెరికాకు తాత్కాలికంగా బదిలీ చేస్తుంటాయి.
EB-5 వీసా ఛార్జి
హెచ్ 1బి , ఎల్ 1 వీసాలతో పాటు ఈబి 5 వీసా ఛార్జీలు కూడా భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఈ వీసా ఫీజు 3675 యూఎస్ డాలర్లు అంటే 3 లక్షల రూపాయలుంది. రేపట్నించి 11160 యూఎస్ డాలర్లకు అంటే 9 లక్షలకు పెరగనుంది. ఈ వీసాను అమెరికా ప్రభుత్వం 1990లో ప్రారంభించింది. ఈ వీసాను అమెరికాలో 5 లక్షల డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడితో వ్యాపారం చేసేవారికి వర్తిస్తుంది.
Also read: Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. 45 మంది దుర్మరణం.. ప్రాణాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook