H1B Visa: హెచ్1బీ వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఆ దేశంలో ఈ వీసాపై ఉద్యోగాలు చేస్తున్న వేలాది భారతీయులకు ప్రయోజనం కల్గించనుంది. హెచ్ 1బీ వీసాల రెన్యువల్ విషయంలో యూఎస్ ప్రభుత్వం విధానాన్ని సులభతరం చేసింది. తొలుత ప్రయోగాత్మకంగా ఆపై అందరికీ ఇది వర్తింపజేయనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హెచ్1బీ వీసాలపై వేలాదిమంది భారతీయులు అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటుంటారు. ఇప్పటివరకూ కాలపరిమితి ముగిసేలోగా రెన్యువల్ కోసం స్వదేశానికి వెళ్లాల్సి వచ్చేది. ఇది చాలా వ్యయప్రయాలతో కూడుకున్న వ్యవహారంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో వీసా కోసం ఏడాదైనా వేచి చూడాల్సి వచ్చేది. అమెరికా ప్రభుత్వం ఇప్పుడు హెచ్ 1బీ వీసాల రెన్యువల్ విషయంలో విధానం సులభతరం చేసింది. హెచ్ 1బీ వీసాల రెన్యువల్ కోసం స్వదేశానికి వెళ్లకుండా అమెరికాలో ఉంటూనే రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని తెలిపింది. డిసెంబర్ నుంచి మూడు నెలలు ప్రయోగాత్మకంగా ఈ కొత్త విధానం అమలు చేయనున్నారు. తొలి దశలో కొన్ని కేటగరీలకు డొమెస్టిక్ రెన్యువల్ జరగనుంది. ఈ దశలో 20 వేల మందికే ప్రయోజనం కల్పించనున్నారు. ఆ తరువాత దశలవారీగా అందరికీ వర్తింపజేయనున్నారు.


డిసెంబర్ నుంచి మూడు నెలల్లోగా హెచ్ 1బీ వీసా గడువు ముగిసేవారు వీసా రెన్యువల్ ఇకపై అమెరికాలో చేసుకోవచ్చు. భారతీయులకు సాధ్యమైనంత త్వరగా వీసా అపాయింట్‌మెంట్లు ఇవ్వాలని భావిస్తున్నామని అమెరికా స్టేట్ ఫర్ వీసా సర్వీసెస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ట్ తెలిపారు. 2022లో భారత విద్యార్ధులకు రికార్డు స్థాయిలో 1.4 లక్షల వీసాలు జారీ అయ్యాయి. అమెరికా వర్శిటీల్లో తరగతుల ప్రారంభానికి ముందే ఇండియాలో స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేసేందుకు పనిచేస్తున్నామన్నారు. 


Also read: World Highest Highway: ప్రపంచంలోనే అతి ఎత్తైన హైవే, 116 అంతస్థుల ఎత్తులో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook