TikTok Ban In USA: అగ్రరాజ్యం అమెరికా భారత్ బాటలోనే పయనిస్తోంది. టిక్ టాక్ ను త్వరలో బ్యాన్ ( US Ban on TikTok ) చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) స్వయంగా వెల్లడించాడు. దీంతో చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ (ByteDance ) సంస్థకు కొలుకోలేని దెబ్బతగలనుంది. కొంత కాలం క్రితం భారత ప్రభుత్వం టిక్ టాక్, హెలో (Helo ) వంటి 59 యాప్స్ తో పాటు మరికొన్ని లైట్ యాప్స్ ను బ్యాన్ చేసింది. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం కనిపించింది. అప్పట్లో భారత్ నిర్ణయాన్ని స్వాగతించిన అమెరికా ( America ) ప్రస్తుతం భారత్ బాటలోనే పయనించాలని నిర్ణయించింది. ( Bank Holidays: ఆగస్టులో బ్యాంకు సెలవులు ఇవే )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


టిక్ టాక్ బ్యాన్ ( TikTok) గురించి ఆమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ ప్రకటించగానే బైట్ డ్యాన్స్ సంస్థ టిక్ టాక్ ను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేయడం ప్రారంభించింది. అందులో భాగంగా టిక్ టాక్ ను మైక్రోసాఫ్ట్ కు అమ్మేందుకు ప్రయత్నిస్తోంది. ఈ డీల్ ఓకే అయితే అమెరికాలో టిక్ టాక్ కొనసాగుతుంది. ప్రభుత్వం, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, ఉన్నత అధికారుల సమాచారాన్ని చైనాకు చేరవేస్తోంది అని అనుమానాలు వ్యక్తం అవుతోండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ( Sexual Harassment: ఆ కోరిక తీర్చకపోతే... సెలవులు ఇవ్వడట ఆ డిపో మేనేజెర్)