Pig Heart Surgery: వైద్య శాస్త్రంలో ఎప్పుడూ ఊహించని.. వైద్య చరిత్రలో ఎప్పుడూ కనుగొనని ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. చాలా ఏళ్ల క్రితమే గుండె మార్పిడి ఆపరేషన్లు మొదలైనా.. జంతువుల గుండెను మనుషులకు అమర్చడం మాత్రం అరుదు. అలాంటి క్రమంలో ఓ పంది గుండెను మనిషికి అమర్చారు అమెరికా వైద్యులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికాలోని మేరీల్యాండ్ మెడికల్ స్కూల్ ఆస్పత్రిలో డేవిడ్ బెన్నెట్(57) అనే వ్యక్తికి పంది గుండెను అమర్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్కంఠభరిత ఆపరేషన్ సక్సెస్ అయిందని డాక్టర్లు ప్రకటించారు. 


ఏం జరిగిందంటే?


అమెరికాలోని బాల్టిమోర్‌ మేరీలాండ్‌ మెడికల్‌ స్కూల్‌ ఆస్పత్రిలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. పంది నుంచి తీసిన గుండెను మనిషికి అమర్చారు అక్కడి వైద్యులు. ఆపరేషన్‌ విజయవంతం కావడం వల్ల వారి ఆనందాన్ని వ్యక్త పరుస్తూ.. సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 


జన్యుపరంగా మార్పులు చేసిన పంది గుండెను మనిషికి అమర్చడం ద్వారా ప్రాణదానం చేసినట్లయింది. ఈ సర్జరీ ద్వారా 57 ఏళ్ల డేవిడ్‌ బెన్నెట్‌ అనే వ్యక్తిని కాపాడారు. సాధారణంగా హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్లలో బ్రెయిన్ డెడ్ వ్యక్తుల గుండెలను ఇతరులకు అమర్చుతారు. అయితే, అలాంటి సంప్రదాయ మార్పిడికి డేవిడ్ బెర్నెట్ ఆరోగ్య పరిస్థితి అనుకూలించలేదు. కాబట్టే డాక్టర్లు అతనికి పంది గుండెను అమర్చారు.


ఇందుకోసం అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం డేవిడ్‌ కోలుకుంటున్నాడని, ఇంకొన్నాళ్లు అబ్జర్వేషన్‌లో ఉంచి ఆయన్ను పర్యవేక్షిస్తామని అమెరికా వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ ఆతడు పూర్తిగా కోలుకుంటే వైద్య చరిత్రలో ఓ అద్భుతం జరిగినట్టే అవుతుంది. 


పంది గుండెను మనిషికి అమర్చడం పట్ల వైద్య శాస్త్రంలో ఇదొక చారిత్రక ఘట్టమని చెబుతున్నారు వైద్యులు. తద్వారా భవిష్యత్తులో ఆర్గాన్‌ డొనేషన్స్‌ కొరతను పరిష్కరించడానికి ఒక మార్గం దొరికినట్లయిందన్నారు. 


అమెరికాలో ప్రతీ ఏడాది సగటున ఆరు వేల మందికి పైగా పేషెంట్లు.. గుండె మార్పిడికి ముందే చనిపోతున్నారు. అవయవాల కొరతే అందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం అమెరికాలో లక్షా పదివేల మందికి పైగా గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.  


Also Read: Afghanistan blast: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ పేలుడు.. 9 మంది చిన్నారులు మృతి!


Also Read: New York Fire Accident: అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం.. 19 మంది మృతి, 60 మందికి గాయాలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి