New York Fire Accident: అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం.. 19 మంది మృతి, 60 మందికి గాయాలు..

New York Fire Accident: అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి 19 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2022, 11:44 AM IST
  • అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం
  • 19 మంది మృతి, 60 మందికి గాయాలు
  • ఈ ప్ర‌మాదంపై న్యూయార్క్​ మేయర్ తీవ్ర దిగ్భ్రాంతి
New York Fire Accident: అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం.. 19 మంది మృతి, 60 మందికి గాయాలు..

New York Fire Accident: న్యూయార్క్ నగరంలోని (New York ) ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం (massive fire) సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది చిన్నారులతో సహా 19 మంది సజీవదహనమయ్యారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉందని న్యూయార్క్‌ మేయర్ సలహాదారు స్టిఫన్ రింగెల్ తెలిపారు. పొగ పీల్చడం వల్ల క్షతగాత్రులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత భారీ అగ్నిప్రమాదాల్లో ఇది ఒకటని నగర అగ్నిమాపక కమిషనర్ పేర్కొన్నారు. అక్కడ స్పేస్ హీటర్ (Space Heater) పనిచేయకపోవడం వల్ల భారీ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. 

న్యూయార్క్ నగరంలోని బ్రాంక్స్‌లోని (Bronx) అపార్ట్‌మెంట్ భవనంలో ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 200 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భవనంలో చిక్కుపోయిన వారిని కాపాడారు. మరణాలు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా చేస్తున్నారు. ఆపార్ట్‌మెంట్‌లోని రెండు, మూడో అంతస్థులో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మంటలు వేగంగా ఇతర అంతస్తులకు వ్యాపించినట్లు చెప్పారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read: Brazil: టూరిస్ట్ బోట్లపై విరిగిపడిన కొండ చరియలు...ఏడుగురు మృతి, 20 మంది గల్లంతు..

ఈ ప్ర‌మాదంపై న్యూయార్క్​ మేయర్ ఎరిక్ ఆడమ్స్ (New York City Mayor Eric Adams) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు​. ఇది 'కోలుకోలేని  విషాదమ‌ని' మిస్టర్ ఆడమ్స్ ట్విట్టర్‌లో రాశారు. వారం రోజుల వ్య‌వ‌ధిలో ఇలాంటి ప్ర‌మాదం జరగడం ఇది రెండోసారి. గత బుధవారం తెల్లవారుజామున ఫిలడెల్ఫియాలోని (Philadelphia) పబ్లిక్ హౌసింగ్ అపార్ట్‌మెంట్ భవనంలో అగ్నిప్ర‌మాదం సంభవించి..12 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో ఎనిమిది మంది పిల్లలున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News