Joe Biden: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అగ్రరాజ్యం అమెరికా విఫలమైందా..అధ్యక్షుడు జో బిడెన్‌పై ఎందుకు విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ఎంత వరకూ పూర్తయింది. ప్రభుత్వంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలెందుకు మరి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బిడెన్(Joe Biden) బాధ్యతలు తీసుకుంటూనే కరోనా వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించారు. ఎన్నికల వాగ్దానాల్లో వ్యాక్సినేషన్ కీలకంగా ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో జోరందుకుంది. భారీగా వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నాటికి 70 శాతం అమెరికన్లకు వ్యాక్సిన్ అందిస్తానని ప్రమాణం చేశారు. అయితే జూలై 4వ తేదీన అమెరికా 245 వ స్వాతంత్య్ర దినోత్సవం(America Independence day) నాటికి జో బిడెన్ చేసిన వాగ్దానం నెరవేరలేదు. జూలై 3 వరకూ కేవలం 67 శాతం పెద్దలకు మాత్రమే వ్యాక్సిన్ అందినట్టు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. మరో రెండు ప్రముఖ దినపత్రికలైతే 60 శాతం లోపే వ్యాక్సిన్ అందిందని కథనాలు ప్రచురించాయి. 35 కోట్ల జనాభా ఉన్న అమెరికా(America)లో 15.7 కోట్లమందికి రెండు డోసులు, 18.2 కోట్లమందికి ఒక డోసు పూర్తయి ఉంటుందని మీడియా వెల్లడించింది. ఈ క్రమంలో జో బిడెన్ టార్గెట్ మిస్సయ్యారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఇతర దేశస్థులకు వ్యాక్సిన్ (Vaccine) డోసులు అందినప్పటికీ చాలావరకూ లెక్కలో తీసుకోకపోవడంతో అమెరికన్లకు డోసులు పూర్తిగా అందలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ గందరగోళం ఏర్పడిందని రిపబ్లికన్లు ఆరోపణలు సంధిస్తున్నారు. అయితే రాష్ట్రాల్నించి పూర్తి స్థాయిలో నివేదికలు అందలేదని వైట్‌హౌస్(White house) వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా జో బిడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాతో యుద్ధం ఇంకా ముగియలేదని..డెల్టా లాంటి ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని చెప్పారు. ప్రమాదకర కరోనా వైరస్ విమక్తి కోసం చేస్తున్న పోరాటంలో చివరి దశకు చేరుకున్నామని..పోరాటం ఆపవద్దని సూచించారు. 


Also read: Philippines Crash: ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం, విమానం కూలిన ఘటనలో 17 మంది మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook