Russian Cancer Vaccine:  కేన్సర్ చికిత్సకు త్వరలో వ్యాక్సిన్ అందించనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తెలిపారు. ప్రస్తుతం ఇది చివరిదశలో ఉన్నట్లు చెప్పారు.కేన్సర్ నయంచేయలేని వ్యాధి. దీనికి ఇప్పటివరకు సరైన చికిత్స విధానం అందుబాటులోకి రాలేదు. కొన్ని చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నా అవి పూర్తి స్థాయిలో నయంచేయలేనివి. అయితే, కేన్సర్ టీకాను రష్యా కసరత్తు చేస్తుంది. కొత్త తరం ఇమ్యూనోమోడ్యులేటరీ తయారీని అధ్యక్షుడు తన చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదీ చదవండి: వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 7 ఫోటోస్ మీకోసం..


ఈ విషయంపై మాస్కో ఫోరమ్‌లో ప్రసంగించారు.. త్వరలో కేన్సర్ చికిత్సకు వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుటులోకి వస్తుంది సమర్థవంతంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానన్నారు. క్యాన్సర్ వంటి నయం చేయలేని వ్యాధిలో రష్యా శాస్త్రవేత్తలు విజయం సాధించబోతున్నారు. రష్యా శాస్త్రవేత్తలు క్యాన్సర్ వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు దగ్గరగా ఉన్నారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు.​ మోడర్నా, మెర్క్ అండ్ కంపెనీ కూడా కేన్సర్ వ్యాక్సిన తయారీ చేస్తున్నాయి. దీన్ని కేన్సర్ మధ్య దశలో ఉపయోగించవచ్చు.


కానీ, ఇది ఏ రకం కేన్సర్‌కు చికిత్స అందిస్తుందనేని పుతిన్ పేర్కొనలేదు. గత సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం క్లినికల్ ట్రయల్ ను ప్రారంభించింది. 2030 నాటికి వేలమంది రోగులకు ఉపయోగపడుతుందని లక్ష్యంగా పెట్టుకుంది. జర్మనీ కూడా ఐయోన్‌టెక్ తో కలిసి బ్రిటన్ ట్రయల్స్ లో నిమగ్నమైంది.


ఇదీ చదవండి: వేలంలో రూ.1.5 లక్షలు పలికిన నిమ్మకాయ.. దాని స్పెషాలిటీ ఏంటో తెలుసా?


ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం హ్యూమాన్ పాపిల్లోమా వైరస్ కి వ్యతిరేకంగా ఆరు లైసెన్స్ పొందిన కేన్సర్ వ్యాక్సిన్లు ఉన్నాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook