చైనా యాప్స్  ( China apps  Ban ) పై నిషేధం విధించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( America president Donald trump ) ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. టిక్ టాక్, వీ చాట్ యాప్ ల నిషేధంపై వాషింగ్టన్ కోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


చైనా దేశానికి చెందిన సోషల్ మీడియా యాప్స్ టిక్ టాక్ ( TikTok ) , వీ చాట్ ( Wechat ) లను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిషేదించారు. ఆ యాప్ లను డౌన్లోడ్ చేసుకోకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిషేదాజ్ఞలపై అమెరికాలోని వాషింగ్టన్ కోర్టు స్టే ( Washington court stay on Ban of Tiktok ) విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులపై టిక్ టాక్ సంస్థ సంతోషం వ్యక్తం చేసింది. 


భద్రత, గోప్యత ఆందోళన నేపథ్యంలో అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం టిక్‌టాక్, వీచాట్ యాప్‌లను నిషేధించింది. అయితే డోనాల్డ్ ట్రంప్‌ నిర్ణయంపై వాషింగ్టన్‌లోని ఫెడరల్ కోర్టు ( Washington Federal court ) లో పిటిషన్ దాఖలైంది. ట్రంప్‌ కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం.. అధికార పరిధులు దాటి టిక్‌టాక్‌‌ను బ్యాన్ చేశారని పిటీషనర్లు ఆరోపించారు. భద్రత, గోప్యత విషయంలో ప్రజల ప్రయోజనాలను కాపాడుతున్నామనని చెబుతున్నా సరే.. తమ ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేదని టిక్ టాక్ సంస్థ వాదించింది.ఈ వాదనతో ఏకీభవించిన వాషింగ్టన్ కోర్టు ట్రంప్ ఆదేశాలపై తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ట్రంప్ ఆదేశాల్ని న్యాయస్థానం నిలిపివేయడం ఇది రెండవసారి. గతవారం వీచాట్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై  కాలిఫోర్నియా కోర్టు ( California court ) సానుకూలంగా స్పందించింది.


యాపిల్, గూగుల్ ఫోన్లో నిషేధం అమల్లోకి రాకుండా నిరోధిస్తూ ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు వాషింగ్టన్ జిల్లా జడ్జి కార్ల్ నికోలస్ వెల్లడించారు. అయితే నవంబర్ 12 నుండి అమల్లోకి రానున్న ఇతర వాణిజ్య శాఖ ఆంక్షలను మాత్రం నిరోధించలేదు. Also read: JIMEX-2020: భారత్-జపాన్ నౌకల యుద్ధ అభ్యాసం.. చైనాకు గట్టి సందేశం