ఎప్పుడూ పొరుగుదేశాలతో కయ్యం పెట్టుకోవడంలో ముందుండే చైనా ( China ) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కోల్డ్ వార్ ( Cold war ) లేదా హాట్ వార్ లు తమకు అవసరం లేదంటూ చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ( China president Xi jinping ) చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కయ్యానికి కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే చైనా నుంచి ఆసక్తి కల్గించే వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఆ దేశాధ్యక్షుడు జీ జిన్ పింగ్ ( xi jinping ) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. చైనా ఎప్పుడూ ఆధిపత్యాన్ని కోరుకోదని..కోల్డ్ వార్ లేదా హాట్ వార్ వంటివి తమకు అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశమవుతోంది. ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వడం, ఆధిపత్య ధోరణితో ఉండే దేశం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం హాస్యాస్పదమని పలువురు విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. 


ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కూడా ఎక్కడో కాదు. సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి 75వ సర్వసభ్య సమావేశం ( UN 75th conference ) లోనే. తూర్పు లడాఖ్ ( East ladakh ) లో భారత-చైనా ( Indo-china ) సైన్యాల మధ్య నాలుగు నెలలుగా ప్రతిష్ఠంభన కొనసాగుతున్న నేపధ్యంలో విబేధాల్ని తగ్గించి చర్చల ద్వారా వివాదాల్ని పరిష్కరించుకోవాలంటూ చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ వెల్లడించారు. 


వర్చ్యువల్ విధానంలో నిర్వహించిన యూఎన్ సమావేశాల్లో ఇంకా పలు అంశాలపై ఆయన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ( Corona virus )‌ సంక్రమణపై తమ దేశంపై అంతర్జాతీయంగా వస్తున్న ఆరోపణలను ఆయన ఈ సందర్భంగా తోసిపుచ్చారు. వైరస్‌ను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సమిష్టిగా ముందుకురావాలని కోరారు. కరోనా వైరస్ మహమ్మారిని అధిగమించడానికి అంతర్జాతీయంగా ఉమ్మడి ప్రణాళిక రూపొందించాలని..సమస్యను రాజకీయం చేయడమనేది సరైన విధానం కాదని చెప్పారు.


దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా నూతన అభివృద్ధి ఫార్ములాను రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నామన్నారు. ఈ నూతన ఫార్ములా చైనా ఆర్ధిక వ్యవస్థతో పాటు  ప్రపంచ ఆర్ధికాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. చైనా ఎప్పుడూ శాంతియుత, సహకార సంబంధాలకే కట్టుబడి ఉందని వెల్లడించారు. ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న వివాదాల్ని చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా తగ్గించుకుంటామని స్పష్టం చేశారు. 


చైనా అధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్యలు నిజంగానే చర్చనీయాంశమవుతున్నాయి. అంతర్జాతీయంగా ఆ దేశంపై వస్తున్న ఒత్తిడిని అధిగమించే దిశగా ఆ దేశ వైఖరిలో మార్పు వచ్చిందా లేదా పైకి అలా మాట్లాడుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. Also read: Japan: జపాన్ లో పెళ్లి చేసుకుంటే.. ప్రభుత్వం కట్నం ఇస్తుందట