Coronavirus airborne: న్యూ ఢిల్లీ: కరోనావైరస్ (Coronavirus) గాలితో కూడా సోకుతుందన్న వాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పుడు అంగీకరించింది. ఇటీవల 32దేశాలకు చెందిన 239 శాస్త్రవేత్తలు గాలిలోని సూక్ష్మ కణాల ద్వారా కరోనా ఒక వ్యక్తి నుంచి మరొకరికి సోకుతుందని, మార్గదర్శకాలు మార్చాలంటూ డబ్ల్యూహెచ్‌వోకు లేఖ రాశారు. అప్పుడు ఈ వాదనను ఖండించిన డబ్ల్యూహెచ్‌వో ఇప్పుడు దానిని కొట్టిపారేయలేమంటూ సమాధానమిచ్చింది. కరోనా వైరస్ కణాలు గాలిలో ఉండటం, లేదా గాలి ద్వారా వ్యాపిస్తుందన్న వాదనలను తోసిపుచ్చలేమని, దీనిపై బలమైన ఆధారాలను సేకరించాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. బుధవారం డబ్ల్యూహెచ్‌వో టెక్నికల్ హెడ్ మరియా వాన్ కెర్ఖోవ్  (Maria Van Kerkhove) మాట్లాడుతూ.. దీనిగురించి పూర్తిస్థాయిలో నిపుణులతో సమీక్ష జరిపి త్వరలోనే కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తామని ప్రకటించారు. ముఖ్యంగా జనం రద్దీగా ఉన్న ప్రాంతాల్లో, గాలి, వెంటిలేషన్ సరిగా లేని ప్రదేశాల్లో గాలి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. Also read: Covid19 virus: మరో 8 నెలల్లో 25 కోట్ల కరోనా కేసులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించినా.. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు పేర్కొంటున్నారు. డిస్టెన్సింగ్ ఒక మీటర్ దూరాన్ని మరింత పెంచాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. Also read: Countries Without Covid-19: కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న దేశాలివే


కరోనా పాజిటీవ్ వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేదా తాకడం ద్వారా మరొకరికి వ్యాపిస్తుందని గతంలో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కరోనా కణాలు గాలిలో కూడా ఉండవచ్చని అభిప్రాయపడుతుండటంతో ప్రజలు మరింత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల మందికి పైగా ప్రజలు కరోనా బారిన పడగా.. 5 లక్షల 35 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. Also read: Apsara Rani & RGV: ఆమె ఒరిస్సా కాదు..ఒడిషా బ్యూటీ


జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..