Covid19 virus: మరో 8 నెలల్లో 25 కోట్ల కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్రమణ భయం గొలుపుతోంది. ఇది చాలదన్నట్టు ఆ అంతర్జాతీయ సంస్థ చెబుతున్న రీసెర్చ్ నివేదిక చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. కరోనా సంక్రమణ ఇప్పట్లో ఆగేది కాదని...మరో 8 నెలల్లో పతాకస్థాయికి చేరవచ్చని ఆ సంస్థ అంచనా వేస్తోంది. ఇంతకీ ఆ సంస్ధ చెబుతున్న అసలు సంగతేంటి

Last Updated : Jul 8, 2020, 02:50 PM IST
Covid19 virus: మరో 8 నెలల్లో 25 కోట్ల కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్రమణ భయం గొలుపుతోంది. ఇది చాలదన్నట్టు ఆ అంతర్జాతీయ సంస్థ చెబుతున్న రీసెర్చ్ నివేదిక చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. కరోనా సంక్రమణ ఇప్పట్లో ఆగేది కాదని...మరో 8 నెలల్లో పతాకస్థాయికి చేరవచ్చని ఆ సంస్థ అంచనా వేస్తోంది. ఇంతకీ ఆ సంస్ధ చెబుతున్న అసలు సంగతేంటి

కోవిడ్ 19 వైరస్ ( Covid19 virus) రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికి  ప్రపంచవ్యాప్తంగా కోటి పది లక్షల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 5న్నర లక్షల వరకూ జనం కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. కరోనా సంక్రమణ వేగంపై నిరంతరం పరిశోధన చేస్తున్న  మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Masachusetts institute of technology) చెబుతున్న గణాంకాలు ఇప్పుడు భయపెడుతున్నాయి. కరోనా సంక్రమణ ( corona pandemic) వేగం ఇప్పుడున్నదానికి 12 రెట్ల కంటే అధికం కావచ్చని ఎంఐటీ ( MIT)  శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ వైరస్ ను కట్టడి చేయలేకపోతే...2021 మార్చ్ నాటికి అంటే...మరో 8 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మందికి కరోనా సోకవచ్చని కచ్చితంగా చెబుతున్నారు ఎంఐటీ శాస్త్రవేత్తలు. 18 లక్షల వరకూ మరణించవచ్చని తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగి...ఏ విధమైన నియంత్రణ చర్యలు లేకుంటే భారతదేశంలో రోజుకు 2 లక్షల 80 వేల కేసులు నమోదయ్యే పరిస్థితి రావచ్చని ఎంఐటీ అంచనా వేస్తోంది. అటు అమెరికాలో 95 వేల కేసులు, దక్షిణాఫ్రికాలో 21 వేలు, ఇరాన్ లో 17 వేల  కేసులు నమోదు కావచ్చనేది ఆ సంస్థ చెబుతున్న మాట. ప్రపంచవ్యాప్తంగా 84 దేశాల సమాచారాన్ని విశ్లేషించి ఈ అంచనాకు వచ్చామని ఎంఐటీ శాస్త్రవేత్తలు ( MIT Scientists) చెబుతున్నారు. ఈ 84 దేశాల్లో భారతదేశం కూడా ఉందని...మొత్తం 475 కోట్ల జనాభా ఉన్న దేశాల సమాచారంపై చేసిన పరిశోధన ఫలితం ఆందోళన కల్గిస్తోందని ఎంఐటీ హెచ్చరిస్తోంది. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్లు హజిర్ రహ్మాన్ దాద్, జాన్ స్టెర్మాన్ చెప్పినదాని ప్రకారం కరోనా వైరస్ తీవ్రత, పరిశుభ్రత, సామాజిక విధానం, ఆసుపత్రుల సామర్ధ్యం,  నిర్ధారణ పరీక్షలు, మరణాల సంఖ్య వంటివాటిని పరిగణలో తీసుకుని ఈ నివేదిక రూపొందించారు. Also read:Countries Without Covid-19: కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న దేశాలివే

ప్రస్తుతానికి కోవిడ్ 19 వైరస్ (Covid19 virus) కు చికిత్స కానీ, వ్యాక్సిన్ గానీ లేనందున నిర్ధారణ పరీక్షలే కరోనా వైరస్ నియంత్రణకు ఉపయోగపడతాయని మసాచుసెట్స్ అభిప్రాయపడింది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి అంటే ముఖ్యంగా మార్చ్ నెల నుంచి నిరంతరం పరీక్షల ( Covid19 tests) పై దృష్టి పెట్టి ఉంటే కరోనా కేసులు చాలావరకూ తగ్గి ఉండేవని కూడా ఎంఐటీ (MIT) అంచనా వేసింది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..  

Trending News