Dinosaurs Extinct : డైనోసార్లు ఎందుకు అంతరించాయి అనేది తెలిసింది
Dinosaurs Extinct : డైనోసార్లు ఎందుకు అంతరించాయి అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఎట్టకేలకు సమాధానం కనుగొన్నారు. చాలా మంది అనుకున్నట్టుగా అగ్నిపర్వతాల ( Valconic Eruption ) విస్పోటనం వల్ల రాక్షసబల్లులు మరణించలేదు అని తేల్చిచెప్పారు. అసలు కారణం ఏంటో కనుగొన్నారు.
Dinosaurs Extinct : డైనోసార్లు ఎందుకు అంతరించాయి అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఎట్టకేలకు సమాధానం కనుగొన్నారు. చాలా మంది అనుకున్నట్టుగా అగ్నిపర్వతాల ( Valconic Eruption ) విస్పోటనం వల్ల రాక్షసబల్లులు మరణించలేదు అని తేల్చిచెప్పారు. అసలు కారణం ఏంటో కనుగొన్నారు. Also Read : Nusrat jahan: టిక్ టాక్ నిషేధం తొందరపాటే : నుస్రత్ జహాన్
రాక్షసబల్లులు భూమిపై ( Dinosaurs Era ) సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం భారీ సంఖ్యలో నివసించేవి అని మనకు తెలుసు. అయితే అవి ఎందుకు అంతరించాయి అనే విషయంలో మాత్రం భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు కూడా వాటికి సంభంధించి పలు పరిశోధనా ఫలితాలను వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు చాలా మంది మంది అగ్నిపర్వతాలు ( Volcano ) విస్పోటనం చెందడం వల్ల డైౌనోసార్లు అంతరించాయని నమ్మేవారు. తాజాగా జరిపిన పరిశోధనలో గ్రహశకలాలు ఢీకొనడం ( Asteroid Strike ) వల్లే డైౌనోసార్లు మరణించాయని తేల్చారు. Read Also : 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణకు ఆదేశం
లండన్ ఇంపీరియల్ కాలేజీకి ( London Imperial College ) చెందిన ప్రొఫెసర్ అలెస్సాండ్రో చియరెంజా టీమ్ చాలా కాలం నుంచి ఈ విషయంలో పరిశోధనలు నిర్వహిస్తోంది. ఈ పరిశోధనలో చియరెంజా టీమ్ పలు ఆసక్తికరమైన విషయాలు కనుగొంది. అంతరిక్షం నుంచి వచ్చిన గ్రహశకలాలు ( Asteroid ) ఢీకొనడం వల్ల డైనోసార్స్ మరణించాయని నివేదించారు. ఈ గ్రహశకలాలు భూమిని ఢీకొట్టినప్పుడు వాటి నుంచి అతి ప్రమాదరమైన రసాయనాలు వెలువడ్డాయని.. వాటి ప్రభావంతో భూమిపై భారీ రసాయనాలు , వాయువులు ( Gas and Particles ) నిండిపోయాయి. అనేక సంవత్సరాల పాటు సూర్యరశ్మి భూమిపైకి ( Sunlight Blocking Gasses ) చేరలేదు. దాంతో వరుసగా శీతాకాలం ( Devastating Winter ) కొనసాగడం.. అది డైనోసార్లు జీవించడానికి ప్రతికూలంగా మారిందని తెలిపారు. దీంతో అవి మనుగడ సాగించలేక అంతరించిపోయాయని తెలిపారు. అయితే తరువాత కాలంలో భారీ అగ్నిపర్వతాలు పేలడం వల్ల భూమిపై మళ్లీ సాధారణ స్థితి ఏర్పడింది అని పరిశోధకులు తెలిపారు..