ప్రపంచం దృష్టి ఇప్పుడు ఫైజర్ కంపెనీ ( Pfizer company )పై పడింది. ఆ కంపెనీ అభివృద్ధి  చేసిన వ్యాక్సిన్ అత్యుత్తమమైందని నిపుణులు చెప్పడమే దీనికి కారణం. మరి ఈ అద్భుతమైన వ్యాక్సిన్ ఇండియాలో రాదా..కారణాలేంటి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రాణాంతక కరోనా వైరస్ ( Corona virus ) కట్టడికి ఇప్పటివరకూ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ లలో అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ( Pfizer cororna vaccine ) అత్యుత్తమమైందనేది నిపుణులు చెబుతున్న మాట. చిట్ట చివరి దశ ట్రయల్స్‌లో ఉన్న ఆ వ్యాక్సిన్‌ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ముఖ్యంగా ఇండియాలో అందుబాటులోకి వస్తుందా లేదా..ఏం సమస్య ఉంది..ఒకవేళ  వస్తే ధర ఎంత ఉండవచ్చు? ఇప్పుడివే ఆసక్తికరమైన ప్రశ్నలు.


జర్మనీకు చెందిన బయోన్టెక్ కంపెనీ ( Biontech ) తో కలిసి అమెరికా కంపెనీ ఫైజర్ కొత్త రకమైన కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) అభివృద్ధి చేసింది. చివరి ట్రయల్స్‌లో ఉన్న ఈ వ్యాక్సిన్ పరీక్షల కోసం 44 వేల మంది వాలంటీర్లను ఎంపిక చేశారు. చివరిగా  22 వేల మందికి వ్యాక్సిన్‌ ఇస్తారు. మరో 22వేల మందికి ప్లేసి బో  ఇస్తారు గానీ ఎవరికేదిచ్చారో వెల్లడించరు. అనంతరం వ్యాక్సిన్ తీసుకున్నవారిలో రోగ నిరోధక శక్తి ( Immunity power )పెరిగిందా లేదా...ఏ మేరకు పెరిగిందనేది అధ్యయనం చేస్తారు. 4 దశలుగా జరిపిన ప్రాధమిక పరీక్షల్లో విజయం సాధించినట్టు...90 శాతం అద్భుత ఫలితాలనిచ్చినట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Also read : Pfizer versus Trump: వ్యాక్సిన్ ప్రకటనపై డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహం


తొలి ప్రాథమిక ట్రయల్స్‌లో  32 మంది, రెండో ప్రాథమిక ట్రయల్స్‌లో 62 మంది, మూడవ ట్రయల్స్‌లో  92 మందిపై, నాలుగవ ట్రయల్స్‌లో 120 మంది వాలంటీర్లపై వ్యాక్సిన్‌ను ప్రయోగించగా.. 90 శాతం సక్సెస్‌ ఫలితాలు వచ్చాయని కంపెనీ వెల్లడించింది.  వ్యాక్సిన్  ప్రయోగాలు పూర్తయ్యాక వాలంటీర్లలో ప్రతికూల మార్పులతోపాటు సానుకూల మార్పుల డేటాను ..లైసెన్స్‌ అనుమతి ఇచ్చే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కు సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసం నవంబర్ నెలాఖరు వరకూ కంపెనీకు సమయముంది.


ఇంతవరకూ బాగానే ఉంది. మరి ఇండియాలో ఈ వ్యాక్సిన్ అందుబాటులో వస్తుందా అనేదే సందేహంగా మారింది. దీనికి కారణం ఆ వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియే. ఈ విషయాన్ని వెల్లూరు సీఎంసీ ( CMC ) లో  మైక్రోబయోలజీ ప్రొఫెసర్ గగన్ దీప్  వెల్లడించారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. 


ఫైజర్ వ్యాక్సిన్‌కు ఇండియాలో అవకాశం లేదా...కారణమేంటి


ఎందుకంటే ఫెజర్‌ వ్యాక్సిన్‌ను ఆర్‌ఎన్‌ఏ ( రైబో న్యూక్లియక్‌ ఆసిడ్‌ ) ( RNA Based Vaccine ) తో తయారు చేశారు. అలాంటి వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చే వ్యవస్థ ఇప్పటి వరకు భారత్‌లో లేనే లేదు. కేవలం డీఎన్‌ఏ ( డీ ఆక్సి రైబో న్యూక్లియక్‌ ఆసిడ్‌) నుంచి తయారు చేసిన వ్యాక్సిన్లకే భారత్‌లో అనుమతి ఉందని ప్రొఫెసర్‌ గగన్‌దీప్‌ చెబుతున్నారు. ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ డోస్‌ను ఎల్లప్పుడు మైనస్‌ 80 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపర్చాల్సి ఉంటుందని, అలాంటి వ్యవస్థ భారత ల్యాబొరేటరీలు, ఆసుపత్రుల్లో లేదని అంటున్నారు. కేవలం ఇండియాలోనే కాదు..ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా దేశాల్లో కూడా లేదని జర్మన్ లాజిస్టిక్స్ సంస్థ కధనంగా ఉంది.  అయితే వ్యాక్సిన్‌ను కనుగొనడం మంచి పరిణామమని.. ఆర్‌ఎన్‌ఏతో తయారు చేయగలిగినప్పుడు డీఎన్‌ఏతో చేయడం పెద్ద కష్టం కాదని అంటున్నారు. 


అమెరికాలో ఈ వ్యాక్సిన్‌ డోస్‌కు 37 డాలర్లు అంటే 2 వేల 750 రూపాయలుండవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో ఒకవేళ ఇండియాకు వచ్చినా...అంతకంటే ఎక్కువ ధర ఉండవచ్చని తెలుస్తోంది. Also read: Donald Trump: రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్‌ని తొలగించిన ట్రంప్