World Economic Forum President Borge Brende: ప్రపంచంలోని అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని  వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే అన్నారు. ఈ ఏడాది దావోస్‌లో జరిగే సమ్మిట్ లో భారతదేశం అందించే  సహకారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ-ప్రైవేట్ సహకారం లో భాగంగా.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ జెనివాలో ఏర్పడిన విషయం తెలిసిందే.  ప్రతి సంవత్సరం జనవరిలో స్విస్ స్కీ రిసార్ట్ టౌన్ దావోస్‌లో వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ దావోస్‌కు ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతారని బ్రెండే అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Cockroach: బొద్దింకలతో విసిగిపోయారా..?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీ ఇంట్లో అస్సలు కన్పించవు..


"మీరు భారతదేశానికి వచ్చినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా లేని ఆశావాదం మీకు అనిపిస్తుందని బ్రెండే అన్నారు.  భౌగోళిక రాజకీయ మాంద్యం, కొన్నిసమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు. ఆర్థిక వృద్ధి అసాధ్యమైనది కాదని, ముఖ్యంగా భారతదేశం విషయంలో "మేము 7 శాతం ఆర్థిక వృద్ధిని చూస్తున్నట్లు తెలిపారు.  ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన యుఎస్ కూడా చాలా బాగా పనిచేస్తోందని బ్రెండే చెప్పారు.


వచ్చే 2-3 సంవత్సరాల్లో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్న బ్రెండే, రాబోయే సంవత్సరాల్లో భారతదేశం 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో ఉందన్నారు. భారతదేశం ముఖ్యమైన సంస్కరణల ద్వారా ముందుకు వెళ్ళిందన్నారు. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన యుఎస్,  చైనాతో పోలిస్తే మనది భారత్ ది మెరుగైన స్థానంలో ఉందన్నారు.  


అలాగే, భారతదేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో మంచి పెరుగుదల కన్పిస్తుంది. దీంతో ఉత్పాదక కార్యకలాపాలు జరుగుతున్నాయి. భారతదేశం యొక్క డిజిటల్ పోటీతత్వాన్ని కూడా ఆయన బ్రెండే ప్రశంసించారు.  నేడు ప్రపంచంలోని సాంప్రదాయ వస్తువుల కంటే డిజిటల్ వాణిజ్యం చాలా వేగంగా పెరుగుతోందని ఆయన అన్నారు. భారతదేశం మంచి స్థానంలో ఉందని,  యుఎస్,  చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఇది మంచి సమయమని బ్రెండే పేర్కొన్నారు. 


భౌగోళిక రాజకీయ వైరుధ్యాలను నిర్వహించడంలో భారతదేశం యొక్క పాత్రపై బ్రెండే మాట్లాడుతూ, "రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ దౌత్య రంగంపై భారత్ తన మార్క్ ను చూపిస్తుందన్నారు.  భారతదేశం యొక్క ప్రధాన ప్రాధాన్యత ఇప్పటివరకు ఆర్థిక వృద్ధిని పొందడం, పేదరికాన్ని నిర్మూలించడం, ఉద్యోగ కల్పనలపై ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. 



డిజిటల్ ఐడిలు, లింక్డ్ బ్యాంక్ ఖాతాలు,  సమర్థవంతమైన చెల్లింపు వ్యవస్థలతో 1.4 బిలియన్ల మంది డిజిటలైజేషన్ విషయానికి వస్తే భారతదేశం ఒక ముఖ్యమైన దేశమని బ్రెండే చెప్పారు. "అదే సమయంలో, కొత్త సాంకేతికతల ఆగమనం ఆందోళనలను లేవనెత్తుతుందన్నారు. ఉత్పాదక AI అందించిన పెద్ద అవకాశాలు ఉన్నప్పటికీ, డీప్‌ఫేక్‌ల రూపంలో బెదిరింపులు, పెరిగిన సైబర్ దాడుల కూడా ఆందోళన కల్గించే అంశాలన్నారు.  


Read MOre: Yashika Aannand: ఎద అందాలతో వల వేస్తున్న యాషిక ఆనంద్ .. హాట్ ఫిక్స్ వైరల్


కాబట్టి, అప్రమత్తంగా ఉంటూనే కొత్త విధానాలను ఆవిష్కరిస్తు ముందుకు వెళ్లాలని  బ్రెండె అన్నారు. సైబర్ క్రైమ్ గత సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుండి USD 2 ట్రిలియన్లను దోచుకుందని  వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే  వెల్లడించారు. 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook