Cockroach: బొద్దింకలతో విసిగిపోయారా..?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీ ఇంట్లో అస్సలు కన్పించవు..

kitchen Tips: మన ఇళ్లలో చాలా మంది ఫుడ్ ఐటమ్స్‌ ఎక్కడంటే అక్కడే పడేస్తుంటారు. కనీసం గిన్నెలపై మూతలు, ప్యాకెట్ లను కూడా సరిగ్గా  క్లోజ్ చేయరు. దీంతో ఆ ఫుడ్ ను తినడానికి బొద్దింకలు వస్తుంటాయి. 
 

1 /6

ఫుడ్ వెస్టేజ్ ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ బొద్దింకలు ఎక్కువగా కన్పిస్తుంటాయి. కిచెన్ లో స్నాక్స్ ఐటమ్స్ తెచ్చుకుంటే నీట్ గా తినేసిన తర్వాత డస్ట్ బిన్ లో పడేయాలి. కానీ కొందరు సింకులోనే పెట్టుకుంటారు..

2 /6

దీంతో కుప్పలుగా బొద్దింకలు అక్కడికి వస్తుంటాయి. ఇంట్లో సింక్ లలో, వాష్ రూమ్ పైపులలో ఇవి ఉంటాయి. ఇవి డస్ట్ బిన్ లు, కింద పడేసిన ఫుడ్ లను తింటుంటాయి. కిచెన్ ఇలా చేస్తే బొద్దింకల బాధ నుంచి బైటపడోచ్చు...

3 /6

బిర్యానీ ఆకుల స్మెల్ అంటే బొద్దింకలు పడదంట. అందుకే కిచెన్ లలో దీన్ని ఎక్కువగా పెట్టుకొవాలి. కొన్నిరకాల ప్రత్యేకమైన స్ప్రేలు కూడా దొరుకుతాయి. ఇవి ఉపయోగిస్తే వీటి సమస్యలు ఉండవు..

4 /6

బేకింగ్ సోడాను బొద్దింకలు ఎక్కువగా తిరిగే చోట స్ప్రే చేస్తే అవి దూరంగా పారిపోతాయి. కిరోసిన్ స్మెల్ కు కూడా బొద్దింకలు దూరంగా వెళ్లిపోతాయని చెబుతుంటారు. కిచెన్ లో ఎప్పుడు సూర్యరశ్మి ఉండేలా చూసుకొవాలి. దీంతో బొద్దింకలు దూరంగా వెళ్లిపోతాయి.  

5 /6

జంక్ ఫుడ్ లు, బైటి దొరికే బిస్కట్లు, కేక్ లను ఇంట్లో పడేయకుండా జాగ్రత్తలు తీసుకొవాలి. ఇల్లు ఎప్పటికప్పుడు నీట్ గా శుభ్రం చేసుకొవాలి. నాఫ్తలిన్ గోళిల వాసనకు కూడా బొద్దింకలు దూరంగా పోతాయని చెబుతుంటారు.

6 /6

బొద్దింకలు తిరిగిన చోట మనం ఏదైన ఫుడ్ ఐటమ్స్ పెడుతుంటాం. పొరపాటున అవి మనం తింటే కడుపులో నొప్పి, అజీర్తి, మోషన్స్ అవుతాయి. కొన్నిరకాల ఏరోసోల్ లను వాడిన కూడా వీటిని తొలగించుకొవచ్చు.