Deer Tested Corona positive: కరోనా మహమ్మారి ఇక నుంచి జంతువులకు కూడా వ్యాపిస్తోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా జింకకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణైంది. అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై వివరాలిలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్(Corona Virus)ఉధృతి ప్రపంచంలోని పలుదేశాల్లో మరోసారి పెరుగుతూ కన్పిస్తోంది. ఇప్పటి వరకూ మనుష్యులకు మాత్రమే సోకిన కరోనా వైరస్ ఇప్పుడు జంతువులపై కూడా ప్రభావం చూపిస్తోంది. అమెరికాలో(America)నమోదైన తొలికేసు ఆందోళన కల్గిస్తోంది. ఈ దేశంలో తొలిసారిగా జింకకు కరోనా వైరస్ సోకింది. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో అడవి తెల్లతోక జింకకు కోవిడ్ 19 వైరస్ సోకిందని (Worlds first Deer with Covid19)అమెరికా వ్యవసాయశాఖ పేర్కొంది. జింకకు వైరస్ ఎలా సోకిందనేది ఇంకా అర్ధం కాలేదు. మనుష్యుల ద్వారానో లేదా ఇతర జింకలు, జంతు జాతుల ద్వారా వైరస్ సోకి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సోకిన వ్యక్తితో సన్నిహిత సంబంధాలున్న జంతువులకు కరోనా వైరస్ సోకిందనేది వైద్య నిపుణుల అంచనాగా ఉంది. ఓహియో స్టేట్ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ చేస్తున్న అధ్యయనాల్లో ఈ విషయం వెలుగు చూసింది. గతంలో కూడా కొన్ని ఇతర జంతువులకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. 


Also read: Kerala Corona Update: కేరళలో ప్రమాద ఘంటికలు, భారీగా పెరుగుతున్న కేసులు, మళ్లీ కర్ఫ్యూ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook