Xi Jinping Tibet visit: టిబెట్‌లో జిన్‌పింగ్ సీక్రెట్ పర్యటన ఎందుకు ?
Xi Jinping Tibet visit: లాసా: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తొలిసారిగా అధ్యక్షుడి హోదాలో టిబెట్‌లో పర్యటిస్తుండటం పతాక శీర్షికలకెక్కింది. గత మూడు దశాబ్ధాలకుపై కాలంలో చైనా నుంచి అధ్యక్షుడి హోదాలో ఉన్న ఓ నాయకుడు టిబెట్‌లో పర్యటిస్తుండటం (Xi Jinping in Tibet) ఇదే తొలిసారి కావడమే ఈ జిన్‌పింగ్ పర్యటనకు ఎక్కడా లేని ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది.
Xi Jinping Tibet visit: లాసా: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తొలిసారిగా అధ్యక్షుడి హోదాలో టిబెట్‌లో పర్యటిస్తుండటం పతాక శీర్షికలకెక్కింది. గత మూడు దశాబ్ధాలకుపై కాలంలో చైనా నుంచి అధ్యక్షుడి హోదాలో ఉన్న ఓ నాయకుడు టిబెట్‌లో పర్యటిస్తుండటం (Xi Jinping in Tibet) ఇదే తొలిసారి కావడమే ఈ జిన్‌పింగ్ పర్యటనకు ఎక్కడా లేని ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. చైనా పట్ల టిబెట్ ప్రజల్లో ఉన్న ఆగ్రహావేశాలను చల్లార్చి వారిలో చైనా పట్ల ఉన్న అసంతృప్తిని తొలగించడానికి వేస్తున్న ఎత్తుగడల్లో భాగంగానే జిన్‌పింగ్ ఈ పర్యటన చేపట్టినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
జిన్‌పింగ్ టిబెట్ పర్యటన (Xi Jinping Tibet tour) ఒక ఎత్తయితే.. జిన్‌పింగ్ బుధవారం నుంచే చైనాలో పర్యటిస్తున్నప్పటికీ.. శుక్రవారం వరకు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచడం మరో ఎత్తు. ఈ కారణంగానే ప్రపంచదేశాల దృష్టి జిన్‌పింగ్ టిబెట్ పర్యటనపై (Xi Jinping's secret visit to Tibet) పడింది.
Also read : China warns Japan: తైవాన్ విషయంలో జపాన్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు, జపాన్‌కు వార్నింగ్
చైనా (China) ఎత్తుగడల్లో మర్మం ఏదైనా.. ఏనాడూ నోరుతెరిచి అంగీకరించిన పాపాన పోలేదు కనుక ఈసారి కూడా టిబెట్ పర్యటనపై అలాంటి వైఖరినే అవలంభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also read : China New Airbase: ఇండో చైనా సరిహద్దు వద్ద మరో వివాదం, కొత్తగా ఎయిర్‌బేస్ నిర్మిస్తోన్న చైనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook