Yudh Abhyas: ఈ ఫోటో చూసి మంచు ప్రదేశంలో ఘర్షణ జరుగుతున్నట్టుగా ఉంది కదా. భారత-అమెరికా సైనికుల మద్య జరిగిన దృశ్యమిది. ఒకరిపై మరొకరు ఏదో విసురుకుంటున్నట్టుగా ఉంది కదా. అదేంటో చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫోటో చూస్తే అదే అన్పిస్తుంది. ఇండియా-అమెరికా సైనికులు ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకుంటున్నట్టు అనుకుంటారు. కానీ వాస్తవానికి అది కాదు. ఈ ఫోటోలో ఉన్నది భారత అమెరికా సైనికులే. అందులో ఏ మాత్రం సందేహం లేదు. కానీ వాళ్లు విసురుకుంటున్నది రాళ్లు కానేకాదు. ఒకరిపై మరొకరు మంచు విసురుకుంటున్నారు. ఎందుకంటే.. భారత అమెరికా సైనికుల(Indo-American Soldiers)మధ్య ఆసక్తికరంగా సాగుతున్న యుద్ధ్ అభ్యాస్ పోటీల్లో భాగంగా జరిగిన సన్నివేశమిది. అదేంటో చూసేద్దాం.


యుద్ధ్ అభ్యాస్‌లో(Yudh Abhyas)భాగంగా వివిధ క్రీడల్లో ఇరు దేశాల సైనికులు పాల్గొన్నారు. కబడ్డీ, వాలీబాల్ పోటీలు ఆసక్తికరంగా సాగాయి. అమెరికాలోని అలాస్కాలో(Alaska) ఇండియా-అమెరికా సైన్యాల మధ్య యుద్ధ్ అభ్యాస్ సంయక్త విన్యాసాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 15న ప్రారంభమైన సంయుక్త విన్యాసాలు 29వ తేదీ వరకూ 14 రోజులపాటు కొనసాగనున్నాయి. ఇండియన్ ఆర్మీ నుంచి 350 మంది, అమెరికన్ ఆర్మీ నుంచి 3 వందలమంది సైనికులు ఇందులో పాల్గొన్నారు. ఇరుదేశాల సైనికులు కలిసి రెండు జట్లుగా విడిపోయి..వివిధ రకాల క్రీడల్లో పాలుపంచుకున్నారు. ముఖ్యంగా కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్(Kabaddi and Volley Ball)ఆటలు ఆడారు. అమెరికన్ సైనికులు కబడ్డీ కూత వేస్తే..భారత సైనికులు ఫుట్‌బాల్ పోటీలో గోల్స్ చేశారు. ఈ స్నేహపూర్వక క్రీడల్లో రెండు దేశాల సైన్యాలు నాలుగు జట్లుగా ఏర్పడి వివిధ రకాల క్రీడలతో క్రీడాస్ఫూర్తి చాటారు. అలాస్కాలోని మంచులో ఇరు దేశాల సైనికులు సందడి చేశారు. ఒకరిపై మరొకరు మంచు విసురుకున్నారు.



రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించే ఉద్దేశ్యంతో ఈ పోటీల్ని నిర్వహించారు. ఇరు దేశాల సైన్యం ఒకరినొకరు అర్ధం చేసుకునేందుకు ఈ క్రీడలు ఉపయోగపడినట్టు సైనికాధికారులు తెలిపారు. ఇండియా-అమెరికా దేశాల సైన్యాల మధ్య అతిపెద్ద సైనిక సంయుక్త విన్యాసాల్ని 17వ సారి నిర్వహిస్తున్నారు. గతంలో ఈ అభ్యాస విన్యాసాలు రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగాయి. 


Also read: Facebook: ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ రాజీనామా చేయనున్నారా, నిజమెంత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి