Facebook: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌కు సంబంధించిన వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. బ్రిటన్‌కు చెందిన ఓ టాబ్లాయిడ్ ప్రచురించిన కధనం ఎంతవరకూ నిజమనేది తేలాల్సి ఉంది. అదే నిజమైతే ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ రాజీనామా చేయనున్నాడా..అసలేం జరుగుతోంది.
ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు(Mark Zuckerberg) సంబంధించిన కీలకమైన వార్త ఇది. ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో మార్క్ జుకర్‌బర్గ్ సీఈవో పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఈ మధ్యకాలంలో విన్పిస్తున్న ఆరోపణలు, జుకర్‌బర్గ్ నేతృత్వంపై విన్పిస్తున్న విమర్శల నేపధ్యంలో జుకర్‌బర్గ్ రాజీనామా చేయనున్నారంటూ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ టాబ్లాయిడ్ ఓ కథనాన్ని ప్రచురించింది. డిజిటల్ ప్రపంచంలో మెటావర్స్ ద్వారా అద్భుతాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్న ఫేస్బుక్(Facebook)..త్వరలో పదివేలమంది నైపుణ్యం కలిగిన ఉద్యోగుల్ని నియమించుకోనుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మార్క్ జుకర్‌బర్గ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలే ఆ టాబ్లాయిడ్ వార్త నిజమనేందుకు నిదర్శనమని సమాచారం. సమీప భవిష్యత్‌లో తాను వ్యవహారాల్ని పర్యవేక్షించినా లేకపోయినా..ఫేస్‌బుక్‌ను సమర్ధవంతంగా నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మార్గ్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించడం దీనికి కారణం.
మెటావర్స్ అంటే ఏమిటి
మెటావర్స్(Metaverse) అనేది ఓ డిజిటల్ ప్రపంచం. త్రీడీ ఎన్విరాన్మెంట్లో కార్యకలాపాలను నడిపించొచ్చు. రాబోయే రోజుల్లో టెక్నాలజీని శాసించేది ఇదేనని నిపుణుల నమ్మకం. ఈ మేరకు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ జులైలోనే ఓ ప్రకటన చేశాడు. ఇక ఫేస్బుక్ మేజర్ సక్సెస్‌లో భాగమైన యూరోపియన్ యూనియన్ నుంచే ఈ ప్రయత్నాల్ని మొదలుపెట్టబోతోంది. పదివేల మంది ఉద్యోగుల్ని రానున్న ఐదేళ్లలో నియమించే ప్రయత్నం చేస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోలాండ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్ నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్‌ను మొదలుపెట్టింది. మరోవైపు మైక్రోసాఫ్ట్, రోబ్లోక్స్, ఎపిక్ గేమ్స్ సైతం సొంత వెర్షన్ మెటావర్స్ కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
బోర్డు సభ్యుల అభ్యంతరం
యూజర్ల డేటా లీకేజి(Users Data Leakage) విషయంలో ఫేస్బుక్ ఎప్పట్నించో విమర్శలు ఎదుర్కొంటోంది. మరోవైపు కొత్తగా ఇన్ స్టాగ్రామ్‌తో(Instagram)మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని ఆ సంస్థ మాజీ కీలక ఉద్యోగిని సంచలన ఆరోపణలు చేస్తోంది. యూజర్ భద్రత కంటే లాభాలే ఫేస్‌బుక్‌కు ఎక్కువయ్యాయని విమర్శిస్తోంది. ఈ నేపధ్యంలో మార్క్ జుకర్‌బర్గ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలనే ఉద్యమం కుడా ప్రారంభమైంది. నవంబర్ 10వ తేదీన క్విట్ ఫేస్బుక్(Quit Facebook) పేరుతో ఆ ఒక్కరోజు ఫేస్బుక్, అనుబంధ యాప్‌లు వాడవద్దంటూ క్యాంపెయిన్ నడుస్తోంది. వరుస పరిణామాలతో మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంపై కొందరు బోర్డు సభ్యులు అసంతృప్తితో ఉన్నారని ఆ టాబ్లాయిడ్ కధనం ప్రచురించినా..మెజార్టీ బోర్డు సభ్యులు మాత్రం జుకర్‌బర్గ్ నాయకత్వానికే మద్దతిస్తున్నారు. ఒకవేళ ఓటింగ్ అంటూ జరిగే పరిస్థితి తలెత్తితే అంతకంటే ముందే రాజీనామా(Mark Zuckerberg to Resign) చేయాలనేది మార్క్ జుకర్‌బర్గ్ ఆలోచనగా ఉందని తెలుస్తోంది.
2004లో హార్వర్డ్ కళాశాలలోని స్నేహితులు, రూమ్మేట్స్తో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్బుక్ సంస్థను స్థాపించాడు. 2066 నుంచి 13 ఏళ్లు పైబడినవారంతా వినియోగించేలా నిబంధన తీసుకొచ్చాడు. ప్రస్తుతం గ్లోబల్ ఇంటర్నెట్ యూసేజ్‌లో ఫేస్బుక్ ఏడవ స్థానంలో ఉండి నెలకు 3 వందల కోట్ల యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. ప్రపంచ కుబేరుల జాబితాలో మార్క్ జుకర్‌బర్గ్ ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు.
Also read: Covid19 Deaths: రష్యాలో మరణమృదంగం మోగిస్తున్న కరోనా వైరస్, ఒక్కరోజులోనే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి