కౌలాలంపూర్ : ప్రపంచంలోనే అతి పెద్ద ఎంటర్ టైన్మెంట్ ప్లాట్ ఫాం  ZEE5 ఇప్పడు మలేషియాలోని అగ్ర శ్రేణి టెలికామ్ ఆపరేటర్ Celcom తో విలువైన భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ రోజు కౌలాలంపూర్ లో ఇరు సంస్ధల మధ్య జరిగిన ఒప్పందం అనంతరం నిర్వహించిన  ఓ ప్రెస్ మీట్ లో ZEE బిజినెస్ ఆఫీసర్ అర్చన ఆనంద్ ఈ విషయాన్ని  తెలిపారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీ ఎంటర్‌టైన్మెంట్‌లో ఎంటర్‌ప్రైజెస్ లిమిటిటెడ్  ( ZEEL ) గ్రూప్ లో భాగస్వామిగా ఉన్న ZEE5 భారతీయ సినిమాలు, టీవీ షోలు, వార్తలు మరియు ఎక్స్లూజివ్ వీడియోలు లాంటి విలువైన కంటెంట్ అందిస్తోంది. ఈ కంటెంట్ సముదాయం హిందీ మరియు ఇంగ్లీష్ భాషలతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం లాంటి సౌత్ ఇండియా భాషలతో పాటు బెంగాలీ, పంజాబీ, ఒడియా, భోజ్ పూరి మరియు గుజరాత్ లాంటి భాషల్లో అందుబాటులో ఉంది.  ZEE5 వేదిక ద్వార మనకు నచ్చిన కార్యక్రమాలతో పాటు జీ గ్రూప్ ఛానళ్లతో సహా 60 ప్రముఖ లైవ్ ఛానళ్లు చూసే వెసులుబాటు ఉంది.


జీ ఎంటర్ టైన్మ్ మెంట్ మరియు ZEE5 గ్లోబల్ సంస్థకు చెందిన సీఈవో అమిత్ మాట్లాడుతూ రానున్న ఆర్ధిక సంవత్సరంలో ZEE5 విస్తరించేందుకు అద్భుతమైన ప్రణాళిక ఉందని పేర్కొన్నారు. ఈ లక్ష్యానికి చేరుకునే క్రమంలో మలేషియా తమకు పెద్ద మార్కెట్ గా నిలుస్తుందన్నారు. కాబట్టి ఇక్కడ విస్తరించేందుకు ఎక్కవ ఫోకస్ పెడుతున్నామని తెలిపారు. ఇక్కడ భారతీయ మరియు దక్షిణ ఆసియా కంటెంట్ కు డిమాండ్ ఉందని విశ్లేషించారు. సాధ్యమైనంత త్వరలో అంతర్జాతీయ భాషల్లో కూడా తాము విస్తరించాలనుకుంటున్నామని... ఈ క్రమంలో కంటెంట్ సమకూర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సి ఉందన్నారు. విశ్వవ్యాప్తంగా విస్తరించాలనుకునే లక్ష్యంతో ఉన్న తమకు మలేషియాకు చెందిన ప్రముఖ టెలీకాం ఆపరేటర్ Celcom భాగస్వామిగా దొరకడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. Celcomతో భాగస్వామ్యం తమకు నూతనోత్సాహాన్ని ఇచ్చిందని వివరించారు


ZEE5 గ్లోబల్ బిజినెస్ చీఫ్ ఆఫీసర్ అర్చన ఆనంద్ మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్ లో వేగంగా దూసుకెళ్తున్న ZEE5 తో చేతులు కలిపేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న  విలువైన భాగస్వాములు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు . సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ లో ప్రముఖ టెలికాం ఆపరేటర్ సంస్థ అయిన Celcom మాతో చేతులు కలిపినందుకు సంతోషంగా ఉందన్నారు. తొలి నుంచే ZEE5కు మలేషియాలో ఎంతో ఆదరణ లభిస్తోందని.. Celcom భాగస్వామ్యంతో తాము మరింత బలపడేందుకు ఉపయోగపడుతుందన్నారు


ప్రముఖ నెట్ వర్క్ సంస్థ ఎపిగెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జొరాన్ వాసిల్జ్ మాట్లాడుతూ  ZEE5 వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్లాట్ ఫాం దొరుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తాజా పరిణామం తమకు ఎంతగానో ఉపయోగకంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.