ఈ ఏడాది వర్షాలతో జలాశయాలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లోని చెరువులు, ఇతరత్రా వనరులు నీటితో కళకళలాడుతున్నాయి. భూగర్భజలాలు సైతం పెరుగుతున్నాయి. మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం (Water level in Srisailam dam) అధికంగా ఉంది. భారీగా ఇన్‌ఫ్లో ఉండటంతో అధికారులు 10 గేట్లను అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం (Srisailam Dam Water Capacity) ఉంది. దాంతో శ్రీశైలం (Srisailam) జలాశయానికి ఇన్ ఫ్లో 2,05,017 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. ఔట్ ఫ్లో 2,06,819 క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 883.9 అడుగులకు చేరడంతో అధిక సంఖ్యలో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు కాల్వ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకుగానూ ప్రస్తుతం నిల్వ 209.59 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు.  



 


ఆసక్తికర కథనాలు