ICMR Vaccine Website: ఐసీఎంఆర్ కరోనా వ్యాక్సిన్ వెబ్‌సైట్ ప్రారంభం

వచ్చే ఏడాది  తొలి త్రైమాసికంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్ (Union Health Minister Harsh Vardhan) చెప్పారు.

Last Updated : Sep 28, 2020, 04:36 PM IST
ICMR Vaccine Website: ఐసీఎంఆర్ కరోనా వ్యాక్సిన్ వెబ్‌సైట్ ప్రారంభం

ప్రపంచ దేశాలతో పాటు భారత్ సైతం కరోనా వైరస్ వ్యాక్సిన్ (CoronaVirus Vaccine) కోసం ఎదురుచూస్తోంది. ముఖ్యంగా అమెరికా తర్వాత భారత్‌లోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. అయితే కోవిడ్19 వ్యాక్సిన్ ఈ ఏడాది వచ్చే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్ (Union Health Minister Harsh Vardhan) తెలిపారు. వచ్చే ఏడాది  తొలి త్రైమాసికంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. Sara Ali Khan: ‘సుశాంత్ ప్రేమలో మునిగా... డ్రగ్స్ మత్తులో కాదు’

దేశ రాజధాని ఢిల్లీలో నేడు ( సెప్టెంబర్ 28న) జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కార్యక్రమాలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ (Harsh Vardhan) పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో మూడు రకాల కరోనా వ్యాక్సిన్‌లకు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని తెలిపారు. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ పరిస్థితిపై అప్‌డేట్స్ కోసం ఆన్‌లైన్ పోర్టల్ (ICMR Vaccine Website) ప్రారంభించినట్లు తెలిపారు. అందులో టీకా ట్రయల్స్ వివరాలు, పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. నేడు ఐసీఎంఆర్ వందేళ్ల టైమ్ లైన్ విడుదల చేయడం గర్వంగా ఉందని, ఐసీఎంఆర్‌కు ఇది చారిత్రకమైన రోజు అని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.  ఐసీఎంఆర్ వ్యాక్సిన్ వెబ్‌సైట్ 

CoronaVirus Vaccine: సింగిల్ డోస్‌తో కరోనా వైరస్ అంతం!

Sanju Samson: సిక్సర్ల సీక్రెట్ వెల్లడించిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్

Trending News